ETV Bharat / bharat

హైకోర్టులకు మరో 16 మంది న్యాయమూర్తులు!

author img

By

Published : Sep 30, 2021, 2:54 PM IST

బాంబే, గుజరాత్​, ఒడిశా, పంజాబ్​ అండ్​ హరియాణా హైకోర్టులకు.. న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని 16 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు(Supreme court news today). వీరిలో ఆరుగురు జుడీషియల్​ అధికారులు, 10 మంది న్యాయవాదులు.

SC collegium recommends 16 names for elevation as judges of 4 HCs
ఆ హైకోర్టులకు 16 మంది న్యాయమూర్తులు

దేశంలోని వివిధ హైకోర్టుల్లో (Supreme court news today) న్యాయమూర్తుల భర్తీ ప్రక్రియను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ(Supreme court chief justice) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వేగవంతం చేసింది. జడ్జిలుగా పదోన్నతులు కల్పించేందుకు మరో 16 మంది పేర్లను ఇప్పుడు కేంద్రానికి సిఫార్సు చేసింది.

బాంబే, గుజరాత్‌, ఒడిశా, పంజాబ్‌ అండ్​ హరియాణా హైకోర్టుల్లో వీరు న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు. 16 మందిలో ఆరుగురు న్యాయ అధికారులు.. మరో 10 మంది న్యాయవాదులు. ఈ మేరకు సుప్రీం​ కోర్టు(Supreme court news today) వెబ్​సైట్​లో వివరాలను పొందుపరిచారు.

నలుగురు జుడీషియల్​ అధికారులు.. ఏఎల్​ పన్సారే, ఎస్​సీ మోరే, యూఎస్​ జోషీ-ఫాల్కే, బీపీ దేశ్​పాండే బాంబే హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఒడిశా హైకోర్టుకు వీరే..

  • ఆదిత్య కుమార్​ మహోపాత్ర(న్యాయవాది)
  • మృగంక శేఖర్​ సాహో(న్యాయవాది)
  • రాధా క్రిష్ణ పట్నాయక్(న్యాయ అధికారి)​
  • శశికాంత మిశ్రా(న్యాయ అధికారి)

గుజరాత్​కు

న్యాయవాదులు.. మౌనా మనీశ్​ భట్​, సమీర్​ జే దవే, హేమంత్​ ఎం. ప్రచ్ఛక్​, సందీప్​ ఎన్​ భట్​, అనిరుద్ధ ప్రద్యుమ్న మయీ, నిరల్​ రష్మీకాంత్​ మెహ్తా, నిశా మహేంద్రభాయి ఠాకూర్​ గుజరాత్​ హైకోర్టుకు జడ్జిలుగా వెళ్లనున్నారు.

న్యాయవాది సందీప్​ మౌద్గిల్​ను.. పంజాబ్​ అండ్​ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేసింది.

జస్టిస్​ రమణ వచ్చిన తర్వాత..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్​వీ రమణ 2021 ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఆయన నేతృత్వంలోని కొలీజియం.. ఖాళీల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులు సహా దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి వంద మంది పేర్లను సిఫార్సు చేసింది.

ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది జడ్జిలు(Supreme Court Judges) ప్రమాణస్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఇంతమంది జడ్జిలు ఒకేసారి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం విశేషం. జస్టిస్ ఎన్​వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు.

2021 మే 1 నాటికి దేశంలోని హైకోర్టులకు 1080 మంది న్యాయమూర్తులను కేటాయించగా, ప్రస్తుతం అవి 420 మందితో మాత్రమే పని చేస్తున్నాయి.

ఇదీ చూడండి: 'నేతలతో కుమ్మక్కైన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు'

'న్యాయవ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ అవసరం'

న్యాయమూర్తులపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి

Supreme Court Judges: సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.