ETV Bharat / bharat

దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై సొంత మామ అత్యాచారం!

author img

By

Published : Feb 3, 2022, 12:11 PM IST

Jalore Rape: సొంత మామే నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అరుపులు విని తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

Jalore rape incident
దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై సొంత మామ అత్యాచారం

4 years old girl raped: రాజస్థాన్ జాలోర్​లో అమానుష ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల చిన్నారిపై సొంత మామే అత్యాచారానికి పాల్పడ్డాడు. పసిపాప అని చూడకుండా మృగంలా ప్రవర్తించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరిగిందంటే?

చిన్నారి తల్లిదండ్రులకు నిందితుడు దూరపు బంధువు అవుతాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. భోజనం చేసిన తర్వాత బాధితురాలి తండ్రి బయటకు వెళ్లాడు. తల్లి కూడా ఆ సమయంలోనే ఇంటి బయట ఉంది. దీంతో ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు నిందితుడు. బాలిక భయంతో అరుపులు, కేకలు వేసింది. వెంటనే బయట ఉన్న తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చి చూడగా పాప ఏడుస్తూ కన్పించింది. జననాంగం నుంచి రక్తస్రావం అవుతుండటాన్ని గమనించి తల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి జోధ్​పుర్ తీసుకెళ్లాలని సూచించారు.

ఘటన అనంతరం పారిపోయిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అత్యాచారం జరిగిందని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్​లో ఇప్పటికే అల్వర్ అత్యాచార ఘటనపై దుమారం చెలరేగింది. ఇప్పుడు మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. దీంతో బాలికలు, మహిళలకు రక్షణ లేదంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: కారు లైట్ల వెలుతురులో విద్యార్థులకు 'పరీక్ష'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.