ETV Bharat / bharat

ఇంజినీరింగ్​లో ప్లంబింగ్​ కోర్సు.. ఏఐసీటీఈ కీలక నిర్ణయం

author img

By

Published : Apr 20, 2022, 6:39 PM IST

Plumbing in Engineering: ఇంట్లో ఏదైనా నీటిపైపు పాడైపోతే వెంటనే ప్లంబర్​కు కాల్​ చేస్తాం. ఎంతో నేర్పుతో సమస్యకు పరిష్కారం చూపుతారు ప్లంబర్​. కానీ, వారిని చాలా మంది చిన్నచూపు చూస్తారు. అయితే, ఇకపై ప్లంబింగ్​ చేసేవారు ఇంజినీర్లే. అందుకు అనుగుణంగా ఇంజినీరింగ్​, ఆర్కిటెక్చర్​లో కొత్తగా ప్లంబింగ్​ కోర్సును ప్రవేశపెట్టనుంది ఏఐసీటీఈ. అందుకు ఐపీఏతో ఒప్పందం కుదుర్చుకుంది.

plumbing in engineering
ఇంజినీరింగ్​లో ప్లంబింగ్​ కోర్సు

Plumbing in Engineering: కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఇంజినీర్​ ఎంత అవసరమో.. ప్లంబర్​ కూడా అంతే కీలకం. ఇంట్లోని శానిటైజేషన్​, నీటి అవసరాల కోసం నేర్పుతో ప్లంబింగ్​ పనులు చేయాలి. అయితే.. చాలా మందికి ఈ రంగంలో సరైన నైపుణ్యం ఉండటం లేదు. దీంతో.. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ప్లంబింగ్​ విద్యపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్​, ఆర్కిటెక్చర్​ ఇన్​స్టిట్యూట్లలో ప్లంబింగ్​ కోర్సును ప్రవేశపెట్టేందుకు ఇండియన్​ ప్లంబింగ్​ అసోసియేషన్(ఐపీఏ)​తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఏఐసీటీఈ ఛైర్మన్​ అనిల్​ డీ సహస్రబుద్ధ, ఐపీఏ జాతీయ అధ్యక్షుడు గుర్మిత్​ సింగ్​ అరోరా ఈ అవగాహన ఒప్పందంపై బుధవారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఇంజినీరింగ్​, ఆర్కిటెక్చర్​, ఇంటీరియర్​ డిజైనింగ్​ చదువుతున్న విద్యార్థులు లేదా సివిల్​, పర్యావరణం, మెకానికల్​ ఇంజినీరింగ్​, ఆర్కిటెక్చర్​, ఇంటీరియర్​ డిజైనింగ్​లో మేజర్​ డిగ్రీ పొందిన పట్టభద్రులు.. ప్లంబింగ్​(వాటర్​, శానిటైజేషన్​) కోర్సును తీసుకోవచ్చు.

" ఇంజినీరింగ్​, ఆర్కిటెక్చర్​ పాఠ్యాంశాల్లో ప్లంబింగ్​ పాఠాలు అవసరమని బలమైన భావన ఉంది. ప్లంబింగ్​ భవనం పటిష్ఠంగా ఉండేందుకు దోహదపడుతుంది. 50 గంటల ప్లంబింగ్​ కోర్సును తీసుకొచ్చేందుకు ఐపీఏ, ఏఐసీటీఈ చేతులు కలిపాయి. ఈ కోర్సులో 80 శాతం పాఠ్యాంశాలు ఉంటే 20 శాతం ప్రాక్టికల్​ అభ్యాసం ఉంటుంది. సాంకేతిక విద్యామండలి అనుమతి పొందిన అన్ని విద్యాసంస్థలు ప్లంబింగ్​ కోర్సును విద్యార్థులకు అందించాలని ఐపీఏ, ఏఐసీటీఈ సూచించింది."

- అనీల్​ డీ సహస్రబుద్ధ, ఏఐసీటీఈ ఛైర్మన్​.

ఏఐసీటీఈ అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా.. ప్లంబింగ్​ కోర్సులు బోధించే ఫ్యాకల్టీకి ట్రైనింగ్​ ఇవ్వనుంది ఐపీఏ. 'ఇది ప్లంబింగ్​ రంగ​ భాగస్వాములకు ఒక గొప్ప అవకాశం. దీని ద్వారా ప్లంబింగ్​ వ్యవస్థీకృతంగా, నిర్మాణాత్మకంగా మారుతుంది. సరైన ప్లంబింగ్​ టెక్నిక్​లపై ఈ రంగంలో ఉన్న ఇంజినీర్లు, ఆర్కిటెక్​లు, విద్యార్థుల్లో నైపుణ్యం కల్పించటం ఐపీఏ లక్ష్యాల్లో ఒకటి.' అని పేర్కొన్నారు ఐపీఏ అధ్యక్షుడు అరోరా.

ఇదీ చూడండి: గెలుపు కోసం 'బాదుడే బాదుడు'.. ఇదో వెరైటీ గేమ్ గురూ!

కూలీ పిల్లలు 'కోటీశ్వరులు'.. ప్రభుత్వ సాయం కోసం తిప్పలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.