ETV Bharat / bharat

సాధారణ ప్రజలతో కేంద్ర మంత్రి రైలు ప్రయాణం

author img

By

Published : Aug 19, 2021, 11:13 PM IST

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సాధారణ ప్రజలతో కలిసి రైలు ప్రయాణం చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒడిశా రాష్ట్రంలో పర్యటించిన ఆయన భువనేశ్వర్​ నుంచి రాయగడ వరకు రైలులో ప్రయాణించారు. తోటి ప్రయాణికుల నుంచి సలహాలను అడిగి తెలుసుకున్నారు.

Railway Minister travel in train
సాధారణ ప్రజలతో కేంద్రమంత్రి రైలు ప్రయాణం

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ రైలు ప్రయాణం చేశారు. రైల్వే శాఖ మంత్రి అయిన ఆయన స్వయంగా హీరాఖంట్​ ఎక్స్​ప్రెస్​లో ఒడిశాలోని భువనేశ్వర్​ నుంచి రాయగడ వరకు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తోటి వారితో కొంత సేపు ముచ్చటించారు. అంతేగాకుండా వారి నుంచి విలువైన సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పలు కీలక పథకాల గురించి వారికి వివరించారు.

Railway Minister travel in train
ప్రయాణికులతో ముచ్చటిస్తున్న కేంద్ర మంత్రి
Railway Minister travel in train
ప్రయాణికులతో ముచ్చటిస్తున్న కేంద్ర మంత్రి

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో పర్యటించారు వైష్ణవ్​. ఇందులో భాగంగా భువనేశ్వర్​ రైల్వే స్టేషన్​ను తనిఖీ చేశారు. అతి త్వరలోనే ఈ స్టేషన్​ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Railway Minister travel in train
ప్రయాణికులతో ముచ్చటిస్తున్న కేంద్రమంత్రి
Railway Minister travel in train
ప్రయాణికులతో ముచ్చటిస్తున్న కేంద్రమంత్రి

"భువనేశ్వర్​ రైల్వే స్టేషన్​లోని ఫ్లాట్​ఫామ్​లను తనిఖీ చేశాను. ప్రయాణీకులతో కూడా మాట్లాడాను. స్టేషన్​ పరిశుభ్రతపై వారు హర్షం వ్యక్తం చేశారు. మరి కొన్ని వినతులు అందాయి. వాటిని పరిశీలిస్తాను. ఈ స్టేషన్​ భువనేశ్వర్​కు గుండె లాంటింది. దీనిని పరిశుభ్రంగా ఉంచుకుందాం."

-అశ్వినీ వైష్ణవ్​, రైల్వే శాఖ మంత్రి

రైల్వేశాఖ మంత్రి స్వయంగా తమతో పాటు ప్రయాణం చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: బళ్లారి వెళ్లేందుకు 'గాలి'కి సుప్రీం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.