ETV Bharat / bharat

రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం, కుటుంబ కలహాలతో భార్య సూసైడ్ - భర్తను కొట్టిచంపిన బంధువులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 4:00 PM IST

Updated : Jan 13, 2024, 7:34 PM IST

Nagarkurnool Suicide Case : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు గడిచాయి. ఈ క్రమంలో గొడవలు మొదలయ్యాయి. గొడవల నేపథ్యంలోనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తుండగా, యువతి భర్త శవపై తేలాడు. యువతి కుటుంబసభ్యులే హత్య చేశారని భర్త తరపు బంధువులు ఆరోపిస్తుండగా, తమ బిడ్డది ఆత్మహత్య కాదని, హత్య చేసి బలవన్మరంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కట్నం కోసం శారీరకంగా, లైంగికంగా వేధించారని, అందుకు కారణమైన వారిని శిక్షించాలంటూ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రెండు వైపుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు, నిజాలేమిటో తేల్చే పనిలో పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సంచలనం రేపుతున్న భార్యాభర్తల అనుమానాస్పద మృతిపై మిస్టరీ కొనసాగుతోంది.

Nagarkarnool Murder Case
Nagarkurnool Suicide Case

Nagarkurnool Suicide Case : కుటుంబ కలహాలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం, హైదరాబాద్ నుంచి ఆమె మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకు వస్తుండగా, ఆమె భర్త హత్యకు గురి కావడం నాగర్​కర్నూల్ జిల్లాలో సంచలనం రేపింది. మృతుల బంధువులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం, నాగర్​కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన సింధు, అచ్చంపేట పట్టణానికి చెందిన నాగార్జున రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అచ్చంపేటలోనే నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల నేపథ్యంలో సింధు శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త నాగార్జున తొలుత అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నాగర్​ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్​ తరలించే క్రమంలో మార్గం మధ్యలో సింధు మృతి చెందింది.

హన్మకొండ ఎస్​ఆర్ యూనివర్సిటీలో విషాదం - పరీక్షలో ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య

"నాగార్జునను సింధు వాళ్ల నాన్న, అమ్మ, మేనమామ ఇంకా కొంత మంది కలిసి చంపారని మేము అనుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలని పోలీస్​స్టేషన్​కు వచ్చి కంప్లెంట్ ఇచ్చాము. చాలా కిరాతకంగా చంపారు. సింధు తనంతట తానే సూసైడ్ అటెంప్ట్​ చేసినప్పుడు తరువాత నాగార్జున మిస్​ అయ్యాడని ఫిర్యాదు చేశాము. హత్యలో ఎవరైతే ఉన్నారో వారందరికీ తగిన శిక్ష పడాలి." - నాగార్జున సోదరి

Nagarkarnool Murder Case : మృతదేహాన్ని అచ్చంపేటకు తీసుకువచ్చే క్రమంలో భర్త నాగార్జునను సింధు తరపు బంధువులు అంబులెన్స్ నుంచి దింపి మరో వాహనంలో తీసుకువెళ్లారు. అప్పటి వరకూ నాగార్జున వారి బంధువులతో ఫోన్​లో మాట్లాడుతూనే ఉన్నారు. అంబులెన్స్ నుంచి దిగిపోయినప్పటి నుంచి నాగార్జున ఫోన్ కలవకుండా పోయింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు డయల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించారు. సెల్​ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ వెతికిన పోలీసులకు కల్వకుర్తిలోని ఓ ప్రాంతంలో నిలిపి ఉన్న తుఫాన్​లో నాగార్జున విగతజీవిగా కనిపించాడు. సింధు తరపు బంధువులే అతన్ని హత్య చేశారని నాగార్జున తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్రాన్స్​జెండర్​గా మారి వేధిస్తున్న భర్త - సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య

మరోవైపు సింధుది బలవన్మరణం కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తండ్రి శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. కొద్దికాలంగా కట్నం తేవాలంటూ నాగార్జున వేధిస్తున్నట్లుగా, అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పేదన్నారు. 11వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో గొడవలు జరిగినట్లుగా చుట్టుపక్కల జనం చెప్పారని, అదే రోజు సింధుని చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద స్థితిలో తన కుమార్తె మృతి చెందిందని, అందుకు కారణమైన డాక్టర్ కృష్ణ, హైమావతి, నాగార్జున తల్లి స్వర్ణ, సహోదరి మౌనిక, ప్రియాంకలపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒంటిపై విచక్షణా రహితంగా కొట్టినట్లుగా దెబ్బలు కూడా ఉన్నాయని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు, అసలు ఏం జరిగిందన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. సింధును తీవ్రంగా కొట్టడం వల్లే ఆత్మహత్య చేసుకుందా? తల్లిదండ్రులు చెప్పినట్లు సింధుపై లైంగిక వేధింపులు నిజమేనా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. అంబులెన్స్ నుంచి నాగార్జునను మరో వాహనంలో ఎవరు తీసుకెళ్లారు. అతన్ని ఎలా హత్య చేశారన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేసు పూర్వాపరాలపై పోలీసులు స్పందించడం లేదు. ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో విచారణ సాగుతున్నందున, త్వరలోనే వారు వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

"మా అమ్మాయి చాలా బాధ చెప్పుకుంది. వాళ్లు చేసినవి మీకు చెప్తే నన్ను చంపేస్తారని మా అమ్మాయి నాతో చెప్పింది. నేను చెప్పమని అడిగాను. అతన్ని వదిలి రమ్మన్నాను. కానీ వాళ్లు నా బిడ్డ ప్రాణం తీశారు. నాకు న్యాయం చేయాలి." - సింధు తల్లి

Nagarkurnool Suicide Case భార్య ఆత్మహత్య భర్త అనుమానాస్పద మృతి వివాహిత కుటుంబీకులేనంటూ ఆరోపణలు

హైదరాబాద్‌లో దారుణం - సాయం చేస్తామని నమ్మించి యువతిపై అత్యాచారం

కరీంనగర్​లో దారుణం - ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి

Last Updated : Jan 13, 2024, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.