ETV Bharat / bharat

పుట్టిన బిడ్డను భూమిలో పాతేసిన తల్లి... శిశువు ఏడుపు విని..

author img

By

Published : Mar 17, 2022, 11:30 AM IST

mother buried her child: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి.. తన శిశువునే వద్దనుకుంది. శిశువును కడతేర్చాలని భావించింది. మట్టిలో పాతిపెట్టి వెళ్లిపోయింది. అయితే, మృత్యువును ఎదురించిన ఆ పసిబిడ్డ.. ప్రాణాలతో బయటపడింది.

Mother buried her child
Mother buried her child

Mother buried her child: అప్పుడే పుట్టిన పసిబిడ్డను భూమిలో పాతిపెట్టి వెళ్లిపోయింది ఓ తల్లి. ఆస్పత్రి ఆవరణలో మట్టిలో కనిపించిన చిన్నారిని చూసి స్థానికులు చలించిపోయారు. శరీరంలో సగభాగం మట్టిలో.. మిగిలిన భాగం భూమిపైన కనిపించిందని తెలుస్తోంది. అమ్మతనానికే మచ్చతెచ్చే ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాలో జరిగింది.

Mother buried her child
మట్టిలో నుంచి తీసిన తర్వాత...

అయితే, చిన్నారి ప్రాణాలతోనే బయటపడటం విశేషం. శిశువు ఏడుపు విన్న ఓ మహిళ.. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని పోలీసులకు సమాచారం చేరవేసింది. ఎస్ఐ రిజ్వాన్ అలీ, హెడ్ కానిస్టేబుల్ శేష్​నాథ్, హోంగార్డు ఇంద్రమణి త్రిపాఠి.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. చిన్నారిని మట్టిలో నుంచి బయటకు తీశారు. అనంతరం, ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు తరలించారు.

Mother buried her child
శిశువుకు అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు

జిల్లా ఆస్పత్రి పిల్లల వైద్యురాలు డాక్టర్ సర్ఫరాజ్, ఇతర వైద్య సిబ్బంది అప్రమత్తమై శిశువుకు వైద్యం అందించారు. చిన్నారి ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Mother buried her child
మరణాన్ని జయించిన శిశువు

శిశువు తల్లి ఇదే ఆస్పత్రిలో ప్రసవం కోసం చేరినట్లు తెలుస్తోంది. ఇక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం, శిశువును వదిలించుకునేందుకు ఇంతటి దారుణానికి పూనుకుంది. ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

ఇదీ చదవండి: అయోధ్యలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.