ETV Bharat / bharat

కరోనా టీకాకు బదులు.. రేబిస్​ వ్యాక్సిన్​!

author img

By

Published : May 2, 2022, 5:11 AM IST

కరోనా టీకాకు బదులు పొరపాటుగా ఓ వ్యక్తికి రేబిస్​ వ్యాక్సిన్​ ఇచ్చారు వైద్య సిబ్బంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ఖేరీలో జరిగింది. అయితే అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు వెల్లడించారు.

covid vaccine
కరోనా టీకా

కొవిడ్​ టీకా తీసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తికి పొరపాటున ర్యాబిస్​ వ్యాక్సిన్​ను ఇచ్చారు ఆసుపత్రి సిబ్బంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ఖేరీలో ఆదివారం జరిగింది. బాధితుడు తన వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ను కొవిన్​ పోర్టల్​లో అప్డేట్​ చేయమని సిబ్బందిని కోరగా అసలు విషయం బయటపడింది. బాధితుడు.. నయాపుర్వా గ్రామానికి చెందిన శివమ్​ జైశ్వాల్​గా గుర్తించారు అధికారులు.

శనివారం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని చీఫ్​ మెడికల్ ఆఫీసర్​ వెల్లడించారు. జైశ్వాల్​కు రేబిస్​ వ్యాక్సిన్​ ఇవ్వడం వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం ఉండదని.. అది రేబిస్​కు ప్రికాషనరీ డోసుగా పనిచేస్తుందని తెలిపారు. వ్యాక్సినేషన్​ చేసేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : విమానాశ్రయాల్లో 'యాంబులిఫ్ట్'.. దివ్యాంగులు, రోగులు ఇక నేరుగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.