ETV Bharat / bharat

'చదువు రాని వ్యక్తి సూసైడ్​ నోట్ రాస్తారా?'.. మహంత్​ మృతిపై అనుమానాలెన్నో...

author img

By

Published : Sep 21, 2021, 3:16 PM IST

మహంత్​ నరేంద్ర గిరి (narendra giri) మృతి కేసులో అనుమానితుడుగా ఉన్న ఆయన శిష్యుడు ఆనంద్​ గిరిని (anand giri) పోలీసులు అరెస్ట్​ చేశారు. లేఖలో ప్రస్తావించిన బడే హనుమాన్​ ఆలయ పూజారి ఆద్య తివారీ, అతని కుమారుడు సందీప్​ తివారీని కూడా యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ముగ్గురిపైన సెక్షన్​ 306 ప్రకారం ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

mahant narendra giri
మహంత్​ నరేంద్ర గిరి మృతి కేసులో నిందితుడు అరెస్ట్​

అఖిల భారతీయ అఖాడా పరిషత్​ అధ్యక్షుడు మహంత్​ నరేంద్ర గిరి (narendra giri) మృతికి కారణాలపై సందిగ్ధం వీడడం లేదు. మహంత్​ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నా.. నరేంద్ర గిరి మృతి పట్ల (mahant death) ఆయన శిష్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతరులను ఎంతో ప్రోత్సహించే నరేంద్ర గిరి వంటి వ్యక్తి ఆత్మహత్య ఎలా చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఆయన మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్​ చేస్తున్నారు.

్
నరేంద్ర గిరి మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేసిన అఖిల భారతీయ అఖాడా పరిషత్
్
ఆనంద్​ గిరిపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​

మరోవైపు మహంత్​ ఆత్మహత్య లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అందులో పేర్కొన్న ఆయన శిష్యుడు ఆనంద్​ గిరిని (anand giri) సోమవారం అర్ధరాత్రి అరెస్ట్​ చేశారు. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని అతని ఆశ్రమానికి చేరుకున్న యూపీ పోలీసులు.. ఆనంద్​ గిరిని దాదాపు గంటన్నర పాటు విచారించారు. సోమవారం సాయంత్రం నుంచే ఆనంద్​ గిరిని గృహ నిర్బంధంలో ఉంచారు ఉత్తరాఖండ్​ పోలీసులు.

లేఖలో ప్రస్తావించిన బడే హనుమాన్​ ఆలయ పూజారి ఆద్య తివారీ, అతని కుమారుడు సందీప్​ తివారీని కూడా యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ముగ్గురిపైన సెక్షన్​ 306 ప్రకారం ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహంత్​ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆనంద్​ గిరి తనను మానసికంగా వేధించాడని మహంత్​ నరేంద్ర గిరి సూసైడ్​ నోట్​లో పేర్కొన్నారు.

'కుట్ర జరుగుతోంది'

మహంత్​ మృతి కేసులో తనను అరెస్ట్​ చేయడాన్ని ఆయన శిష్యుడు ఆనంద్​ గిరి తప్పుపట్టారు.

"నరేంద్ర గిరి మృతి వెనుక కుట్ర జరుగుతోంది. గురువు నుంచి డబ్బులు గుంజే వాళ్లే ఈ చర్యకు పాల్పడి.. లేఖలో నా పేరును ప్రస్తావించారు. గురూజీ ఆయన జీవితంలో ఒక్కసారి కూడా ఉత్తరం రాయలేదు. చదవాల్సిన, రాయాల్సిన పని ఉంటే శిష్యులతో చేయించేవారు. అలాంటి వ్యక్తి 5-7 పేజీల లేఖ ఎలా రాయగలరు? ఆత్మహత్యకు కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ లేఖలోని చేతిరాతపై దర్యాప్తు చేయాలి."

-ఆనంద్​ గిరి, మహంత్​ నరేంద్ర గిరి శిష్యుడు

ఆత్మహత్య లేఖలో ఉన్నది నరేంద్ర గిరి చేతిరాతేనా? లేదా ఇంకెవరిదైనా అయ్యుంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు వివరాలు ప్రకారం..

మహంత్ నరేంద్ర గిరి సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో భోజనం చేసిన తర్వాత విశ్రాంతి కోసం బాంగాబరి మఠంలోని గదికి వెళ్లారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీ తీసుకునే అలవాటు ఉన్న నరేంద్ర గిరి.. సోమవారం టీ తీసుకోలేదు. అవసరమైతే పిలుస్తానని శిష్యులతో చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి సమాచారం రాకపోయేసరికి శిష్యులు నరేంద్ర గిరికి ఫోన్​ చేశారు. స్విచ్​ఆఫ్​ అని రావడం వల్ల ఆయన గదికి చేరుకుని తలుపు తట్టారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో శిష్యులు సుమిత్ తివారీ, సర్వేష్ కుమార్ ద్వివేది, ధనంజయ్ సహా పలువురు తలుపు పగలగొట్టారు. ఆ సమయంలో నరేంద్ర గిరి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

మహంత్​ వారం రోజుల క్రితం కూడా ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు లేఖలో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు.

ప్రాణం మీదకు తెస్తున్న ఆస్తి..

మహంత్​ నరేంద్ర గిరి మృతితో సాధువుల మరణాలు చర్చనీయాంశమయ్యాయి. ఓ సన్యాసి ఆత్మహత్యకు పాల్పడటం ఇది తొలిసారి ఏం కాదు. ఆస్తి తగదాల కారణంగా ఎందరో సాధువులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్​లో ఈ ఆస్తి వివాదాల వల్ల ఇప్పటివరకు 24 మంది సన్యాసులు హత్యకు గురయ్యారు.

ఈ తగాదాల వెనుక రాజకీయ నాయకలు, మాఫియా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహంత్​ సుధీర్​ గిరి హత్య కేసే అందుకు ఉదాహరణ. సుధీర్​ గిరి హత్యకు సంబంధించి ఇద్దరు స్థిరాస్తి డీలర్లను పోలీసులు అరెస్ట్​ చేశారు. కానీ కొంతకాలానికే ఈ కేసు పక్కదారి పట్టింది.

ఉత్తరాఖండ్​లోని వివిధ కోర్టుల్లో సాధువుల ఆస్తికి సంబంధించిన కేసులు వేలల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి : 10 రోజులుగా బౌద్ధ సన్యాసి పార్థివదేహానికి పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.