ETV Bharat / bharat

HPCL Engineering Jobs : ఇంజినీరింగ్​ అభ్యర్థులకు గుడ్​న్యూస్​.. హెచ్​పీసీఎల్​లో 276 ఉద్యోగాలు!

author img

By

Published : Aug 20, 2023, 10:51 AM IST

HPCL Engineering Jobs In Telugu : నిరుద్యోగ యువతకు గుడ్​ న్యూస్​. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హెచ్​పీసీఎల్​ 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ తదితర పూర్తి వివరాలు మీ కోసం..

HPCL Recruitment 2023 for 276 Various Posts
HPCL Engineering Jobs

HPCL Engineering Jobs : ఇంజినీరింగ్​ చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. హిందూస్థాన్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​ (HPCL) 276 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల వివరాలు
HPCL Engineer Recruitment 2023 :

  • మెకానికల్​ ఇంజినీర్​ - 57
  • ఎలక్ట్రికల్​ ఇంజినీర్​ - 16
  • ఇన్​స్ట్రుమెంటేషన్​ ఇంజినీర్​ - 36
  • సివిల్​ ఇంజినీర్​ - 18
  • కెమికల్ ఇంజినీర్​ - 43

ఇవే కాకుండా CGD, సీనియర్​ ఆఫీసర్స్​, అసిస్టెంట్​ మేనేజర్స్​, ఛార్టర్డ్​ అకౌంటెంట్స్​, లా ఆఫీసర్స్​, మెడికల్ ఆఫీసర్స్​, వెల్ఫేర్ ఆఫీసర్​, ఐటీ ఆఫీసర్​ తదితర పోస్టులు కూడా ఉన్నాయి.

విద్యార్హతలు
HPCL Job Qualifications : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి ఆయా విభాగాలలో బీఈ/ బీటెక్​/ ఎంబీఏ/ పీజీడీఎం/ ఎమ్మెస్సీ/ ఎంబీబీఎస్​ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
HPCL Job Age Limit : 2023 సెప్టెంబర్​ 8 నాటికి ఇంజినీరింగ్​ అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 25లోపు ఉండాలి. మిగతా పోస్టులకు ఆయా పోస్టులను అనుసరించి ఏజ్​ లిమిట్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్​ చూడండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
HPCL Application Fee : జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1,180 + బ్యాంకింగ్​ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్​ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక ప్రక్రియ
HPCL Job Selection Process : అభ్యర్థుల ఎంపిక కోసం మూడు దశల వడపోత విధానాన్ని అనుసరిస్తారు. ముందుగా కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి.. గ్రూప్​ టాస్క్​ ఉంటుంది. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని పర్సనల్​ ఇంటర్వ్యూ చేస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన వారిని ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

నోట్​ : లా ఆఫీసర్​ పోస్టులకు మూట్ కోర్ట్​ నిర్వహిస్తారు. ఇందులో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

జీతభత్యాలు
HPCL Salary : ఇంజినీరింగ్ ఉద్యోగాలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు జీతం ఉంటుంది. మిగతా వాటికి ఆయా పోస్టులను అనుసరించి భారీగా జీతభత్యాలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్​ చూడండి.

దరఖాస్తు విధానం
HPCL Application Process :

  • అభ్యర్థులు ముందుగా www.hindustanpetroleum.com వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి.
  • వెబ్​సైట్​లోని Careers > Job Openings పై క్లిక్ చేయాలి.
  • HPCL Vacancy దరఖాస్తు ఫారంను ఓపెన్​ చేయాలి.
  • దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్​లోడ్​​ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • దరఖాస్తులోని వివరాలు అన్నీ సరిచూసుకొని, అప్లికేషన్ సబ్​మిట్​ చేయాలి.

ముఖ్యమైన తేదీలు
HPCL Recruitment 2023 Important Dates :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 ఆగస్టు 18
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 18
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.