ETV Bharat / bharat

'మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే ఆత్మహత్యకు అనుమతివ్వండి'.. ఉల్లిరైతుల వినతి!

author img

By

Published : Feb 25, 2023, 10:49 PM IST

ఉల్లికి సరైన మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని మహారాష్ట్ర రైతులు కోరారు. లేదంటే తాము ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతివ్వాలని అన్నారు. తమను ఆదుకోకపోతే నిరసనలకు దిగుతామని కేంద్రాన్ని హెచ్చరించారు.

maharashtra farmer onion
ఉల్లి రైతుల నిరసన

ఉల్లిపాయలకు సరైన మద్దతు ధర కల్పించకుంటే.. తాము ఆత్మహత్య చేసుకునేందుకైనా అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర నాశిక్ జిల్లా రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉల్లి సాగు కోసం తాము పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని వాపోయారు.

"నేను ఇప్పటికే ఉల్లిసాగు కోసం రూ.3.5 లక్షలు ఖర్చు చేశాను. నేను పండించిన ఉల్లిపాయలను విక్రయిస్తే ప్రస్తుత ధరను బట్టి రూ.లక్ష కూడా రాదు. ఇలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు.కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదు. మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగే హక్కు మాకు ఉంది. లేదంటే ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి. మా పిల్లలకు రూ.10 చాక్లెట్ కొనడం గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్వింటాల్ ఉల్లి మార్కెట్లో రూ.300-400 మాత్రమే పలుకుతోంది."
-ఉల్లి రైతు

మూడు నాలుగు నెలల క్రితం ఉల్లి పంటను వేశామని మరో రైతు తెలిపాడు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.300-400 మాత్రమే ఉందని వాపోయాడు. ఉల్లిసాగుకు దాదాపు రూ.50-60 వేలు ఖర్చయిందని చెప్పాడు. అయితే తన దగ్గర ఉన్న ఉల్లిని అమ్మినా రూ.10-11 వేలు మాత్రమే వస్తాయని అన్నాడు. ఇంత నష్టాన్ని ఉల్లి సాగు చేేస రైతులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయాడు.

"ఎకరం విస్తీర్ణంలో ఉల్లి పండించాం. బంగారం తాకట్టు పెట్టి మరీ ఉల్లి సాగు చేశాం. మొత్తం రూ.50 వేలు ఖర్చు అయ్యింది. మార్కెట్లో ఉల్లిపాయలను అమ్మితే కనీసం రూ.20 వేలు కూడా రాలేదు. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మా పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి. గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. లేదంటే మేం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వాలి."
-మహిళా రైతు

512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2
మహారాష్ట్ర సోలాపుర్​​లో ఓ రైతుకు ఎంతో కష్టపడి పండించిన పంటను విక్రయించినా కనీసం టీ ఖర్చులు కూడా తిరిగి రాలేదు. సోలాపుర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 512 కిలోల ఉల్లిపాయలను విక్రయించిన రైతు.. రూ.2 మాత్రమే సంపాదించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.