ఝార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లాలో (Jharkhand News) దారుణం జరిగింది. విద్యార్థినిపై ఓ యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. శరీరం తీవ్రంగా కాలిపోవడం వల్ల బాలిక మరణించింది. అత్యాచారం విఫలం కావడం వల్లే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం అక్టోబర్ 28న బాధితురాలు (Jharkhand Ramgarh news) ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో పక్కింట్లో నివసించే ఓ యువకుడు.. బాలికపై అత్యాచారం చేసేందుకు ఇంట్లోకి చొరబడ్డాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. చివరకు అత్యాచారం విఫలం కావడం వల్ల బాలికను హత్య చేయాలని ప్రయత్నించాడు. బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. అనంతరం తలుపు గొళ్లెం పెట్టి పారిపోయాడు.
ఈ సమయంలో బాధితురాలి (Rape Victim News) తండ్రి పొలం పనులకు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఇంట్లో నుంచి మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గుర్తించారు. పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి.. తన కూతురు కూడా అందులో ఉంది. దీంతో వెంటనే ఆమెను బయటకు తీసుకొచ్చి.. రామ్‌గఢ్‌లోని సర్దార్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు రాంచీ రిమ్స్‌లో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు తనిఖీలు చేపట్టారు.
ఇదీ చదవండి: మామ అత్యాచారం.. గర్భం దాల్చిన 15 ఏళ్ల బాలిక