ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదంలో అత్యాచార బాధితురాలి తండ్రి మృతి

author img

By

Published : Mar 10, 2021, 7:41 PM IST

అత్యాచారానికి గురైన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఓ తండ్రి.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. టీ కోసం వచ్చిన అతడ్ని ఓ ట్రక్కు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.

Father of rape survivor killed in road accident in Uttar Pradesh's Kanpur
దారుణం: రోడ్డు ప్రమాదంలో అత్యాచార బాధితురాలి తండ్రి మృతి

బాలికపై అత్యాచారం జరిగిందన్న షాక్ నుంచి తేరుకోకముందే... ఆమె తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించడం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

అసలేం జరిగింది?

కాన్పుర్​ జిల్లాలోని ఘటమ్​పుర్ ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని.. సోమవారం(మార్చి 8న) పశువులకు మేత తీసుకురావడానికి బయటకు వెళ్లింది. గోలు యాదవ్​, దీపు అనే ఇద్దరు నిందితులు.. ఆ 13 ఏళ్ల బాలికను అపహరించి.. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అయితే విషయం తెలుసుకున్న బాలిక తండ్రి.. పరీక్షల కోసం బాధితురాలిని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. బాలికను ఆసుపత్రిలో ఉంచి.. అతను టీ తాగడానికి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఓ ట్రక్కు వచ్చి అతన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడ్ని లాలా లజ్​పతి రాయ్​(ఎల్​ఎల్​ఆర్​) ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రణాళిక ప్రకారమే ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు గోలు యాదవ్​ను అరెస్టు చేసినట్లు కాన్పుర్ డిప్యూటీ ఐజీ ప్రీతిందర్​ సింగ్​ తెలిపారు. గోలు సోదరుడు సౌరభ్​, స్నేహితుడు దీపు కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

గోలు ఓ పోలీసు సబ్​ఇన్​స్పెక్టర్ కుమారుడు కావడం గమనార్హం.

మరో దారుణం

కాన్పుర్​ జిల్లా అమేఠీలోని మోహన్​గంజ్​ గ్రామంలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై బంధువే అఘాయిత్యానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. మార్చి 8న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పంజాబ్​లో బామ్మపై అఘాయిత్యం

పంజాబ్​ బటిండా నగరంలోని తలవండి సాబో ప్రాంతంలో రాయా గ్రామంలో 72 ఏళ్ల బామ్మపై అత్యాచారం జరిగింది.

హరియాణా నుంచి రాయాలోని తన బంధువు ఇంటికి వెళ్లింది. అక్కడే బామ్మ కాలుకి గాయమైంది. దీంతో తిరిగి ఇంటికెళ్లాల్సిన ఆమె.. అక్కడే ఉండిపోయింది. ఇంట్లోవారంతా వేరే పని మీద బయటకు వెళ్లిపోయారు. ఇదే అదునుగా.. బామ్మ దూరపు బంధువు.. ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన ఆమెను కొట్టాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆ గ్రామంలో జీన్స్​, షార్ట్స్​పై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.