ETV Bharat / bharat

ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్

author img

By

Published : Aug 21, 2022, 3:51 PM IST

రూ.60 కోట్లు విలువ చేసే డ్రగ్స్​ను సీజ్​ చేశారు కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది. జింబాబ్వే నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల డ్రగ్స్​ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

drugs
డ్రగ్స్

Drugs Seized In Kerala : కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. 30 కేజీల డ్రగ్స్​ను ఓ ప్రయాణికుడి నుంచి కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల​ విలువ మార్కెట్​లో రూ.60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జప్తు చేసిన డ్రగ్స్​ను పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపారు.

డ్రగ్స్​ సరఫరా చేసిన వ్యక్తిని పాలక్కడ్​కు చెందిన మురళీధరన్ నాయర్​గా అధికారులు గుర్తించారు. అతడు జింబాబ్వే నుంచి దోహా మీదగా దిల్లీ వచ్చాడు. అక్కడి నుంచి ఎయిర్ ఏషియా విమానంలో కొచ్చి విమానాశ్రయానికి రాగా.. అక్కడి సిబ్బంది తనిఖీలు చేశారు. దీంతో అతడి బ్యాగ్​లో ఉన్న 30 కేజీల డ్రగ్స్ బయటపడ్డాయి. అధునాతన త్రీడీ ఎమ్​ఆర్​ఐ స్కానింగ్ యంత్రం ఉపయోగించి డ్రగ్స్​ను గుర్తించారు కొచ్చి విమానాశ్రయ అధికారులు.

ఇవీ చదవండి: కాంగ్రెస్​కు ఆనంద్​ శర్మ షాక్, కీలక పదవికి రాజీనామా, ఆజాద్​ బాటలోనే

ప్రేమను ఒప్పుకోలేదని దారుణం, కారుతో ఢీకొట్టి చంపిన ఉన్మాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.