ETV Bharat / bharat

పుట్టినరోజు వేడుకల్లో పేలిన తుపాకీ.. చివరికి!

author img

By

Published : Aug 23, 2021, 6:28 PM IST

Updated : Aug 23, 2021, 7:44 PM IST

ఛత్తీస్​గఢ్​లో ఓ యువకుడు.. స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న క్రమంలో తుపాకీతో కాల్పులు జరపబోయాడు. అనుకోకుండా తుపాకీ పేలి.. మరో యువకుడు మృతిచెందాడు.

celebrating birthday party
పుట్టినరోజు వేడుకల్లో పేలిన తుపాకీ

పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అత్యుత్సాహం ప్రదర్శించిన బర్త్​డే బాయ్​.. తుపాకీ తీసి గాల్లో కాల్పులు జరపబోయాడు. ఈ క్రమంలో తుపాకీ పేలి.. మరో యువకుడు మృతిచెందాడు. ఛత్తీస్​గఢ్​లోని దుర్గ్ జిల్లాలో జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..

దుర్గ్​ జిల్లా వైశాలి పోలీస్​ స్టేషన్ పరిధిలోని జవహార్​ నగర్​లో 12వ తరగతి చదువుతోన్న ఓ యువకుడు స్నేహితులతో కలిసి పుట్టినరోజులు వేడుకులు జరుపుకున్నాడు. ఈ క్రమంలో తన అంకుల్​ ధనంజయ సింగ్​ పేరు మీద ఉన్న లైసెన్స్డ్​​ తుపాకీని బయటకు తీసి లోడింగ్​, అన్​లోడింగ్​ చేశాడు. ఈ క్రమంలో అది అనుకోకుండా పేలింది. ఆ బుల్లెట్​ మరో యువకుడి పొట్టలోకి దూసుకెళ్లింది. దీంతో బాధితుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.

సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ధనంజయ సింగ్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: Live Video: పాములకు రాఖీ కట్టేందుకు యత్నం- వ్యక్తి మృతి

Last Updated :Aug 23, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.