ETV Bharat / bharat

మరో రెండు కరోనా వ్యాక్సిన్లు, ఔషధానికి కేంద్రం అనుమతి

author img

By

Published : Dec 28, 2021, 11:36 AM IST

Updated : Dec 28, 2021, 12:08 PM IST

Covovax Corbevax Molnupiravir
మరో రెండు కరోనా వ్యాక్సిన్లు, ఔషధానికి కేంద్రం అనుమతి

11:28 December 28

మరో రెండు కరోనా వ్యాక్సిన్లు, ఔషధానికి కేంద్రం అనుమతి

Covovax approval India: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (పుణె) తయారుచేసిన 'కొవొవాక్స్‌', బయోలాజికల్‌-ఈ తయారు చేసిన కార్బెవాక్స్‌ అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చింది సీడీఎస్​సీఓ(కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ). మోల్నుపిరవిర్ డ్రగ్​కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ తెలిపారు.

కొవొవాక్స్​, కార్బెవాక్స్, మోల్నుపిరవిర్​కు అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులివ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన ఒక రోజు వ్యవధిలోనే సీడీఎస్​సీఓ ఈ నిర్ణయం తీసుకుంది.

Corbevax vaccine latest news:

"భారత్​కు శుభాకాంక్షలు.. కరోనాపై పోరాటాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దేందుకు కార్బెవాక్స్​, కొవొవాక్స్​, మోల్నుపిరవిర్​లను ఒకే రోజులో సీడీఎస్​సీఓ, కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతులిచ్చాయి," అని మాండవీయ ట్వీట్​ చేశారు.

తాజా అనుమతులతో దేశంలో అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉన్న టీకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​, జైడస్​ క్యాడిలా, స్పుత్నిక్​ వీ, మొడెర్నా, జాన్సన్​ అండ్​ జాన్సన్​లకు ఇప్పటికే అనుమతులు లభించాయి.

Last Updated : Dec 28, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.