ETV Bharat / bharat

ఆర్​బీఐ గవర్నర్​​కు కరోనా పాజిటివ్​

భారత రిజర్వు బ్యాంక్​ గవర్నర్​ శక్తికాంతదాస్​కు కరోనా సోకింది. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషనలో ఉన్న దాస్​.. అక్కడ నుంచే విధులు కొనసాగించనున్నారు.

rbi governer
ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​
author img

By

Published : Oct 25, 2020, 8:05 PM IST

భారత రిజర్వు బ్యాంక్​ గవర్నర్ శక్తికాంతదాస్​​ కరోనా బారిన పడ్డారు. వైద్యపరీక్షల్లో కొవిడ్​-19 పాజిటివ్​గా వచ్చినట్లు ఆదివారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం లక్షణాలు లేకుండా క్షేమంగానే ఉన్నట్లు తెలిపిన ఆయన.. ఐసోలేషన్​లో ఉండి విధులు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. తనకు కాంటాక్ట్​ అయిన అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

"నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వ్యాధి లక్షణాలు లేవు. క్షేమంగానే ఉన్నాను. ఈ మధ్యకాలంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోండి. ప్రస్తుతం ఐసోలేషన్​లోనే ఉండి పనిచేస్తున్నా. ఆర్​బీఐ యథావిథిగానే నడుస్తుంది. నేను డిప్యూటీ గవర్నర్లు, ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​, టెలిఫోన్​ ద్వారా టచ్​లోనే ఉంటాను"

-- శక్తికాంతదాస్​​, ఆర్​బీఐ గవర్నర్​

లాక్​డౌన్​ తర్వాత కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు పలు చర్యలు తీసుకున్నారు శక్తికాంతదాస్​. సంప్రదాయ, అసాధారణమైన ద్రవ్య విధాన నిర్ణయాలను తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.