ETV Bharat / bharat

కమల్​ X కమలం: మధ్యప్రదేశ్​లో బలపరీక్ష వాయిదా

కమల్​నాథ్ సర్కార్ భవితవ్యం ఎటూ తేలకుండానే మధ్యప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఆ రాష్ట్ర గవర్నర్​ లాల్జీ టాండన్ ఒక్క నిమిషంలోనే ప్రసంగం ముగించిన కాపేపటికే భాజపా సభ్యుల గందరగోళం నడుమ సభను మార్చి 26కు వాయిదా వేశారు స్పీకర్​.

mp-house-adjourned-till-march-26
కమల్​నాథ్​ సర్కార్ భవితవ్యం తేలకుండానే సభ వాయిదా
author img

By

Published : Mar 16, 2020, 12:31 PM IST

మధ్యప్రదేశ్‌ శాసనసభ నాటకీయ పరిణామాల మధ్య ఈ నెల 26 వరకూ వాయిదాపడింది. ఇవాళ విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆదేశించినప్పటికీ అసెంబ్లీ స్పీకర్ ఎన్​పీ ప్రజాపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేవలం ఒక్క నిమిషంలోనే ప్రసంగాన్ని పూర్తి చేసి సభను వీడారు టాండన్​. అనంతరం ఈ నెల 26వరకు సభను వాయిదావేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బలపరీక్ష నిర్వహించాలని భాజపా సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించినా పట్టించుకోలేదు.

జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాతో కమల్‌నాథ్ సర్కారు మైనారిటీలో పడిపోయింది. ఇవాళ బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ సీఎం కమల్‌నాథ్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ విశ్వాస పరీక్ష జరుగుతుందని భావించినప్పటికీ.. అలా జరగలేదు.

ఇదీ చూడండి: 'మోదీ నమస్తే' చిత్రంతో సైకత శిల్పి కరోనా సందేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.