రాజస్థాన్‌లో తమ ఎమ్మెల్యేల విలీనంపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించింది బహుజన్ సమాజ్ పార్టీ. కాంగ్రెస్ చర్యను సవాలు చేస్తూ న్యాయస్థానంలో రిట్ దాఖలు చేసినట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్ సింగ్ బాబా వెల్లడించారు.
శాసససభ స్పీకర్ కార్యాలయంలోనూ మరో పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు బాబా. ఎమ్మెల్యేల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఫిరాయింపు!
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సందీప్ యాదవ్, వాజిబ్ అలీ, దీప్‌చంద్, లఖన్ మీనా, జోగేంద్ర అవానా, రాజేంద్ర.. బీఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు.
దిలావర్ పిటిషన్‌పై..
ఈ విలీన ప్రక్రియకు సంబంధించి భాజపా ఎమ్మెల్యే మదన్ దిలావర్ కూడా హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం కోర్టు విచారణకు స్వీకరించింది. మార్చిలో చేసిన ఫిర్యాదును స్పీకర్ తిరస్కరించటాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ వేశారు.