ETV Bharat / bharat

శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

author img

By

Published : Sep 6, 2020, 7:50 AM IST

చైనాతో సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక రహదారుల నిర్మాణాలను వేగవంతం చేసింది భారత్​. హిమాచల్​ప్రదేశ్​ నుంచి లద్దాఖ్​ వరకు కీలక రహదారి పూర్తి కావస్తోంది. శత్రువులు గుర్తించేందుకు వీలు లేని ఈ రహదారి ద్వారా సైనికులను సురక్షితంగా సరిహద్దులకు చేర్చేందుకు వీలుకలగనుంది.

highway-untraceable-by-enemy
వ్యూహాత్మక రహదారి

భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ..సరిహద్దులో నిర్మిస్తోన్న వ్యూహాత్మక మూడో రహదారి సిద్ధమైంది. హిమాచల్​ ప్రదేశ్​ నుంచి లద్దాఖ్​ వరకు 258 కిలోమీటర్ల మేర ఉన్న ఈ నిమ్ము-పదమ్​-దార్చా రహదారి పనులు దాదాపు పూర్తి కావచ్చాయని తెలిపింది సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్​ఓ). మంచు కొండల మధ్య నుంచి వెళ్లే క్రమంలో పొరుగు దేశాలు ఈ రహదారిని గుర్తించలేవని, అందువల్ల సురక్షితంగా సైనికులను సరిహద్దులకు చేర్చే వీలుకలగనుందని వెల్లడించింది.

మరో రెండు రహదారులు.. శ్రీనగర్​-కార్గిల్​-లేహ్​, మనాలీ సర్చూ- లేహ్​ రోడ్లు​ నిర్మాణంలో ఉన్నాయి. అయితే.. ఇవి సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల శత్రువులు వీటిపై నిఘా పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి.

గతంలో లేహ్​ నుంచి మనాలీ వరకు వెళ్లేందుకు 12-14 గంటల సమయం పట్టేది. కానీ.. నూతన రహదారి ద్వారా కేవలం 6-7 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రోడ్డుకు ఉన్న మరో విశేషం.. 365 రోజులు తెరిచే ఉంటుంది. మిగతా రెండు రహదారులు కేవలం 6-7 నెలలు అందుబాటులో ఉంటాయి. నవంబర్​ నుంచి 6 నెలల పాటు మూసి ఉంటాయి.

ఈ వ్యూహాత్మక రహదారిపై ప్రస్తుతం వాహనాలు వెళుతున్నాయని, టన్నుల కొద్ది బరువులను తీసుకెళ్లే ట్రక్కులు వెళ్లేందుకు కూడా సిద్ధమని బీఆర్​ఓ ఇంజినీర్లు తెలిపారు.

"30 కిలోమీటర్లు మినహా దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ రోడ్డును సైన్యం వినియోగించుకోవచ్చు. మనాలీ నుంచి లేహ్​ వెళ్లేందుకు దాదాపు 5-6 గంటల సమయం ఆదా కావటం ముఖ్య విషయం. అలాగే ఇతర దేశాలు ఈ రోడ్డును గుర్తించేందుకు వీలు లేకపోవటం వల్ల భద్రత పరమైన ఆందోళన లేకుండా సైన్యాన్ని తరలించవచ్చు. ఈ రోడ్డు ఏ సరిహద్దుకు సమీపంలో లేదు."

- ఎంకే జైన్​, సూపరింటెండెంట్​ ఇంజినీర్​ కమాండర్​ 16 బీఆర్​టీఎఫ్​.

ఇదీ చూడండి: చైనాకు చెక్​: లద్దాఖ్​కు కొత్త రోడ్డు మార్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.