ETV Bharat / bharat

రెండు చేతులతో పెయింటింగ్​- పెన్సిల్​ ఆర్ట్స్​లోనూ ప్రతిభ

author img

By

Published : Oct 20, 2020, 10:04 AM IST

కర్ణాటకలో ఓ యువతి పెయింటింగ్​లో అద్భుతాలను సృష్టిస్తోంది. హాసన్​ జిల్లాకు చెందిన ఆమె.. ఏకకాలంలో రెండు చేతులతో బొమ్మలను గీస్తూ.. తన ప్రతిభను చాటుకుంటోంది. ఇటీవలే 'ఆసియా బుక్​ ఆఫ్​ రికా​ర్డ్స్​, 'ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​'​లో చోటు దక్కించుకుంది.

ASIA BOOK OF RECORD: A young lady achievement in painting in Karantaka
ఔరా! ఆమె 'రెండు చేతులు' ఎంత అందంగా గీస్తున్నాయి

రెండు చేతులతో పెయింటింగ్​- పెన్సిల్​ ఆర్ట్స్​లోనూ ప్రతిభ

కర్ణాటక హాసన్​ జిల్లాలో ఓ యువతి పెయింటింగ్​లో అద్భుత ప్రతిభను కనబరుస్తోంది. ఒక చేత్తో బొమ్మలను గీస్తే అందులో పెద్ద ఆశ్చర్యమేమీ ఉండకపోవచ్చు. అయితే.. ఏకకాలంలోనే రెండు చేతులతో ఒకే విధంగా తన కళను చాటుకుంటోంది మేఘన. ప్రస్తుతం ఫార్మసీ విద్యనభ్యసిస్తోన్న ఆమె.. ఇటీవలే ఓ అద్భుతమైన పెయింటింగ్​ను కేవలం 50సెకన్ల నిడివిలో పూర్తి చేసి రికార్డ్​ నెలకొల్పింది. మేఘన ప్రతిభకు మెచ్చి.. 'ఆసియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్'​, 'ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్' వరించాయి.

A young lady achievement in painting in Karantaka
ఏకకాలంలో రెండు చేతులతో పెయింటింగ్​​ గీస్తున్న మేఘన
A young lady achievement in painting in Karantaka
రెండు చేతులతో గీసిన చిత్రలేఖనం

కుటుంబ సభ్యుల నుంచి ప్రముఖుల వరకు

పిన్న వయసులోనే పెయింటింగ్​పై అవగాహన కల్పించుకున్న మేఘన.. పెన్సిల్​ ఆర్ట్​లోనూ చక్కగా రాణిస్తూ సవ్యసాచిగా మారింది. తన కుటుంబ సభ్యులు, మిత్రులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా ప్రముఖ గాయకుల చిత్రాలను గీసింది ఆమె. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్​ ఏపీజే అబ్దుల్​ కలామ్​, ప్రధాని నరేంద్ర మోదీ వంటి ప్రముఖుల పెయింటింగ్​లను ఆకర్షణీయంగా గీసింది.

A young lady achievement in painting in Karantaka
ఇండియా బుక్​ ఆఫ్​ ధ్రువీకరణ పత్రం
A young lady achievement in painting in Karantaka
సాధించిన పతకాలతో మేఘన

అంతేకాకుండా.. కరోనా వైరస్​పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఇటీవలే ఓ చిత్రాన్ని గీసి లండన్​లో పెయింటింగ్ కాంపిటీషన్స్​కు పంపింది ఈ సవ్వసాచి.

A young lady achievement in painting in Karantaka
కరోనాపై అవగాహన కల్పిస్తూ గీసిన చిత్రం

ఇదీ చదవండి: రంగురంగుల పిన్నులతో దుర్గామాత చిత్రపటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.