ETV Bharat / bharat

పర్యావరణ పరిరక్షణ సూచీలో భారత్‌@8.. 'నెట్‌ జీరో' లక్ష్యాన్ని చేరుకుంటామని హామీ..

పర్యావరణ మార్పు ఆచరణ సూచీ (సీసీపీఐ)-2023లో భారత్​ 8వ ర్యాంకును పొందింది. కాలుష్యం బారి నుంచి పుడమి తల్లిని పరిరక్షించుకునే చర్యల్లో మన దేశం తన నిబద్ధతను చాటుకుంటోంది. గతంలో కన్నా మెరుగైన పనితీరుతో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది.

CCPI India Rank
CCPI India Rank
author img

By

Published : Nov 16, 2022, 6:58 AM IST

CCPI India Rank: కాలుష్యం బారి నుంచి పుడమి తల్లిని పరిరక్షించుకునే చర్యల్లో మన దేశం తన నిబద్ధతను చాటుకుంటోంది. గతంలో కన్నా మెరుగైన పనితీరుతో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. పర్యావరణ మార్పు ఆచరణ సూచీ (సీసీపీఐ)-2023లో 8వ ర్యాంకును పొందింది. గతంలో కన్నా రెండు స్థానాల మేరకు ఉన్నతి సాధించడం విశేషం. పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యమివ్వడం, కర్బన ఉద్గారాల కట్టడి చర్యలు ఇందుకు దోహదపడ్డాయి. ఐరోపా సమాజం సహా 63 దేశాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న మూడు ప్రభుత్వేతర పర్యావరణ సంస్థలు సంయుక్తంగా సోమవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 92శాతం వరకు కర్బన ఉద్గారాలు వెలువడటానికి కారణమయ్యే దేశాలు ఈ నివేదిక పరిధిలోకి వచ్చాయి.

ఇంధన వినియోగాలు, కర్బన ఉద్గారాల్లో ఉన్నత స్థాయి రేటింగ్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. వాతావరణ విధానాలు, పునరుత్పాదక ఇంధన విభాగాల్లో మధ్యస్థ పనితీరును కనబరిచింది. అయినప్పటికీ గతంలో కన్నా రెండు స్థానాలు పైకి ఎగబాకి 8వ ర్యాంకును పొందింది. 2030 ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే, పునరుత్పాదక ఇంధనాల విషయంలో వెనుకబడి ఉందని నివేదిక పేర్కొంది. 'నెట్‌ జీరో' లక్ష్యాన్ని 2070కు చేరుకుంటామని భారత్‌ హామీ ఇచ్చింది.

ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య కారక దేశమైన చైనా ఈ ఏడాది 13 స్థానాలను కోల్పోయి 51వ ర్యాంకులో నిలిచింది. కొత్తగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించడంతో మొత్తం మీద చాలా తక్కువ స్థాయి రేటింగ్‌ను పర్యావరణ సంస్థలు ఇచ్చాయి. అమెరికా మూడు స్థానాలను మెరుగుపరచుకుని 52వ ర్యాంకు పొందింది. ఇరాన్‌ (63), సౌదీ అరేబియా(62), కజఖ్‌స్థాన్‌(61) ర్యాంకులతో చిట్టచివరి స్థానంలో నిలిచాయి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.