ETV Bharat / bharat

ఆగ్రహంతో రైలు తగలబెట్టిన అభ్యర్థులు- ఆర్​ఆర్​బీ పరీక్షలు వాయిదా

author img

By

Published : Jan 26, 2022, 1:51 PM IST

Updated : Jan 26, 2022, 5:42 PM IST

RRB Exam Scam Protests: ఆర్​ఆర్​బీ పరీక్షల వ్యవహారం బిహార్​లో తీవ్ర హింసకు దారితీసింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ గయాలో నిరసనలకు దిగిన ఉద్యోగార్థుల్లో కొందరు.. విధ్వంసానికి పాల్పడ్డారు. రైలును తగులబెట్టారు.

Aspirants vandalized train
ఆర్​ఆర్​బీ పరీక్షలు నిలిపివేత

ఆర్​ఆర్​బీ పరీక్షలో 'అక్రమాల'పై ఆగ్రహం- రైలు తగలబెట్టిన అభ్యర్థులు!

RRB Exam Scam Protests: ఆర్​ఆర్​బీ పరీక్షల్లో 'అక్రమాల'పై బిహార్​లో జరుగుతున్న నిరసనలు మూడో రోజు హింసాత్మకంగా మారాయి. గయాలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన ఉద్యోగార్థుల్లో కొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. ఆర్​ఆర్​బీ ఎన్టీపీసీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Aspirants
రైలును తగలబెట్టిన నిరుద్యోగులు

ఆందోళనల్లో భాగంగా గయా జంక్షన్​లో ఆందోళనకారులు గుమిగూడారు. రైల్వే బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భాభువా-పట్నా ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​కు నిప్పంటించారు. అయితే రైలులో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన సమయంలో రైలు యార్డ్​లో పార్కు చేసి ఉందని, కొందరు దుండగులు దానికి నిప్పంటించారని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్​వో రాజేశ్ కుమార్​ తెలిపారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Aspirants
పూర్తిగా దగ్ధమవుతున్న రైలు
Aspirants
నిరుద్యోగుల నిరసన

రైల్వే మంత్రి స్పందన

బిహార్ సహా ఉత్తర్​ప్రదేశ్, ఝార్ఖండ్​లో అభ్యర్థుల ఆందోళనలపై రైల్వే మంత్రి అశ్వని వైశ్ణవ్ స్పందించారు. ఉద్యోగార్థులు సంయమనం పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ ఆస్తుల్ని మీరే ధ్వంసం చేసుకోద్దని యువతకు సూచించారు. ఆర్​ఆర్​బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తామని, అభ్యర్థుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ ఫిర్యాదులను అధికారికంగా రైల్వే బోర్డుకు సమర్పించాలని పేర్కొన్నారు.

" అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు లేవనెత్తిన విషయాలను తీవ్రంగా పరిశీలిస్తాం. అభ్యర్థుల ఇబ్బందుల గురించి తెలుసుకోవాలని ఆర్​ఆర్​బీ ఛైర్మన్​కు సూచించాం. దీనిపై నివేదిక రూపొందించి కమిటీకి అందించాలని చెప్పాం. ఫిర్యాదుల కోసం ఓ ఈమెయిల్ అడ్రస్​ను ఏర్పాటు చేశాం. కమిటీ దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అభ్యర్థుల సమస్యల గురించి తెలుసుకుంటుంది. "

-అశ్వని వైష్ణవ్​, రైల్వే మంత్రి

ఎన్టీపీసీ, లెవెల్​ 1 పరీక్ష వాయిదా..

అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆర్​ఆర్​బీ ఎన్టీపీసీ, లెవెల్​ 1 పరీక్షలకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదులు పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలో పాస్​ అయిన, ఫెయిల్ అయిన అభ్యర్థుల ఫిర్యాదులను స్వీకరిస్తామని చెప్పారు. అనంతరం నివేదిక రూపొందించి రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు వివరించారు.

" అభ్యర్థుల ఇబ్బందులు, లేవనెత్తిన అనుమానాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. మొదటి దశ ఫలితాలు, ఎంపిక విధానాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. అభ్యర్థులు తమ ఫిర్యాదులను rrbcommittee@railnet.gov.in ఈమెయిల్​కు పంపవచ్చు. ఫిబ్రవరి 16 వరకు ఫిర్యాదులు, సలహాలను కమిటీ స్వీకరిస్తుంది. వీటిని పరిశీలించిన తర్వాత మార్చి 4లోగా కమిటీ తమ సిఫారసులు రైల్వే బోర్డుకు తెలియజేస్తుంది."

-రైల్వే బోర్డు అధికార ప్రతినిధి.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15నుంచి జరగాల్సిన ఆర్​ఆర్​బీ ఎన్టీపీసీ రెండో దశ పరీక్ష, ఆర్​ఆర్​సీ మొదటి దశ పరీక్షలను తాత్కాలికంగా వేస్తున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.

నిరసనలు అందుకే..

ఆర్​ఆర్​బీ ఎన్టీపీసీ పరీక్షను రెండు దశల్లో నిర్వహించడాన్ని అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేస్తే ఆర్​ఆర్​బీ ఎన్టీపీసీ తొలిదశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT)ను రాసి అర్హత సాధించిన వారిని మోసం చేసినట్లే అవుతుందని వారు ఆరోపిస్తున్నారు. జనవరి 15న తొలిదశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి.

ఆర్​ఆర్​బీ ఎన్టీపీసీ లెవెల్​ 2 నుంచి లెవెల్​ 6 వరకు 35,000 పోస్టుల కోసం 1.25కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 26, 2022, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.