నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం: ఏపీ హైకోర్టు

author img

By ETV Bharat Telugu Desk

Published : Nov 20, 2023, 4:15 PM IST

HC_Comments_on_CBN_Bail_Petition

AP High Court Comments on Chandrababu Bail Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మాంజూరు చేసింది. నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని.. హైకోర్టు తీర్పులో పేర్కొంది. చంద్రబాబు, తెలుగుదేశం ఖాతాకు నిధుల మళ్లింపుపై ఆధారాలు లేవన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలను న్యాయస్థానం అంగీకరించింది.

AP High Court Comments on Chandrababu Bail Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్ట్) రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్ట్.. స్కిల్ కేసు విషయంలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.

High Court Key Comments on Skill Developments Case: నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని..హైకోర్టు తీర్పులో పేర్కొంది. చంద్రబాబు, తెలుగుదేశం ఖాతాకు నిధుల మళ్లింపుపై ఆధారాలు లేవన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలతో అంగీకరిస్తున్నామని న్యాయమూర్తి వెల్లడించారు. ప్రతి ఉపగుత్తేదారు తప్పులకు ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాల్లేవని.. హైకోర్టు పేర్కొంది. స్కిల్ డెవలప్​మెంట్​ కేసు విచారణ మొదలయ్యాక.. 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారన్న హైకోర్టు.. కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్టు చేశారని గుర్తు చేసింది. విచారణ కాలంలో కేసును చంద్రబాబు ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారమూ లేదని చెప్పింది. చంద్రబాబు జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఎన్‌ఎస్‌జీ (NSG) భద్రతలో ఉన్నారన్న హైకోర్టు.. కేసు విచారణ నుంచి ఆయన తప్పించుకునే అవకాశం గానీ, విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు సాధారణ బెయిల్‌

High Court on Suman Bose signature Argument: సీమెన్స్‌తో ఒప్పందంలో సుమన్‌ బోస్‌ పేరుతో సంతకం ఉందన్న ప్రాసిక్యూషన్‌ వాదనలపై హైకోర్ట్ స్పందించింది. సంతకాలు పరిశీలించే బాధ్యత సీఎంది కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సంతకంపై అభ్యంతరాలుంటే ఫోరెన్సిక్ విభాగం తేలుస్తుందని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే అక్రమ లావాదేవీలు జరిగాయనేందుకు ఆధారాల్లేవని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీంతోపాటు ఐటీ శాఖ విచారణలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందన్న వాదనలకు ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అక్రమ కేసుల్లో చంద్రబాబును ఇరికించారన్నది హైకోర్టు తీర్పుతో స్పష్టమవుతోంది: ముప్పాళ్ల సుబ్బారావు

Regular Bail Granted Chandrababu in Skill Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు.. ఈ నెల 28 వరకే వర్తిస్తాయని స్పష్టం చేసింది. నవంబర్ 29 నుంచి రాజకీయ సభలు, ర్యాలీల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనవచ్చని హైకోర్ట్ స్పష్టతనిచ్చింది. ఈ నెల 30న చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టు ముందు హాజరై, వైద్య చికిత్సకు సంబంధించిన నివేదికను అందించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సూచించింది.

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు

చంద్రబాబుపై అవినీతి బురద వేయటం వైకాపా తరం కాదు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు 29వ తేదీ నుంచి పులిలా ప్రజల్లోకి వస్తారని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటంపై మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం... N.T.R. భవన్ వద్ద సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబుపై అవినీతి బురద వేయటం వైకాపా తరం కాదని నేతలు మండిపడ్డారు.

చంద్రబాబుకు బెయిల్ రావడంతో అమరావతి గ్రామల్లో సంబర వాతావరణం కనిపించింది. తుళ్లూరు గ్రంథాలయం కూడలిలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. చంద్రబాబుకి మద్దతుగా నినాదాలు చేశారు. నిజం బయటికి వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై పెట్టిన ఏ ఒక్క కేసు కూడా నిలవదని అమరావతి ప్రజలు అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.