అక్రమ కేసుల్లో చంద్రబాబును ఇరికించారన్నది హైకోర్టు తీర్పుతో స్పష్టమవుతోంది: ముప్పాళ్ల సుబ్బారావు
Advocate Muppalla Subbarao Interview: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో... సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు స్పందించారు. ఇదే కేసులో చంద్రబాబు ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉండగా... ఇప్పుడు పూర్తిస్థాయి బెయిల్ మంజూరైనట్లు తెలిపారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోయినప్పటికీ.. ఎవరో ఇద్దరు మద్దాయిలు చెప్పారని, రెండు సంవత్సరాల తరువాత చంద్రబాబు పేరును చేర్చారని పేర్కొన్నారు. రెండు రోజుల విచారణ పేరుతో చంద్రబాబుపై చార్జిషీట్ దాఖలు చేశారని ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. ఈ కేసులో సీఐడీ... ఇప్పటివరకూ... 141 మంది సాక్షులను విచారించి... 4వేల పత్రాలను స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎండగట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు వయస్సు, ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు సాధారణ బెయిల్ మంజురు చేసిందని సుబ్బారావు పేర్కొన్నారు.