ETV Bharat / bharat

అంతుచిక్కని జ్వరం.. ఐదుగురు చిన్నారులు మృతి!

author img

By

Published : Aug 24, 2021, 1:40 PM IST

అంతుచిక్కని జ్వరంతో(Mysterious Fever) ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులే ఉన్నారు. మరో 80 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

mysterious fever
అంతుచిక్కని జ్వరం

ఉత్తర్​ప్రదేశ్​లో అంతుచిక్కని జ్వరం (Mysterious Fever) కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ జ్వరంతో ఉత్తర్​ప్రదేశ్ మథురా జిల్లా కొన్హా గ్రామంలో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులే ఉండటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మరో 80 మంది మధురా, ఆగ్రాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాజస్థాన్​లోనూ..

మరోవైపు రాజస్థాన్​లోని భరత్​పుర్​లోనూ ఇలాంటి కేసులే నమోదయ్యాయి. వైద్యాధికారుల వివరాల ప్రకారం.. ఇద్దరు చిన్నారులు సేవక్(9), హనీ(6) ఆస్పత్రిలోనే మృతి చెందారు. మిగతావాళ్లు రుచి(19), అవినాశ్(9), రోమియా(2), రేఖ(1) అదే లక్షణాలతో మృతిచెందారు.

కొన్హా గ్రామంలో పర్యటించిన వైద్యుల బృందం.. మలేరియా, డెంగ్యూ, కొవిడ్​-19 పరీక్షల కోసం మృతుల కుటుంబసభ్యులు, బంధువుల శాంపిల్స్ సేకరించారు. వైద్యపరీక్షల్లో కొంతమందికి రక్తకణాలు పడిపోయాయని.. డెంగ్యూ జ్వరం అని తాము భావిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: 'చికెన్​ ఫ్రై' బాగా వండలేదని భార్యను చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.