కరోనా చికిత్స(Covid treatment) కోసం దేశవ్యాప్తంగా 1.33 లక్షల మంది బ్యాంకుల నుంచి అప్పులు(Covid related loans) తీసుకున్నట్లు ఆర్థికశాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్, మహారాష్ట్రలు ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు బిల్లులు వేయటంతో వాటిని చెల్లించడానికి చాలామంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆసుపత్రుల్లో చేరిన ఖాతాదారుల కుటుంబ సభ్యుల కోసం బ్యాంకులు అన్‌సెక్యూర్డ్ రుణాలు ఇచ్చాయి. కరోనా కారణంగా అప్పటికే ఉపాధి, ఉద్యోగావకాశాలు దెబ్బతిన్న ఎంతోమంది బ్యాంకులు అందించిన ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ఆసుపత్రుల ఫీజులు చెల్లించారు. కేవలం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారే 1.33 లక్షలమంది ఉన్నారు.
ఆసుపత్రుల ఫీజులు చెల్లించడానికి ఇతర ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు మార్గాలలో రుణాలు తీసుకున్నవారు అదనం.
ఇదీ చదవండి: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్