TDP Mahanadu: ఆహా! ఏమిరుచి.. మహానాడు రుచులను ఆస్వాధించారు మైమరిచి...

By

Published : May 28, 2023, 6:40 AM IST

thumbnail

 Food Varieties In TDP Mahanadu:  మహానాడులో ఉభయ గోదావరి వంటకాలను అందరికీ రుచిచూపించారు. అద్భుతమైన వంటకాలను ఆప్యాయత, అనురాగాలతో వడ్డించారు.  తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో మహానాడు 2023 వైభవంగా జరుగుతోంది.ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు హాజరయ్యారు. ఎన్టీఆర్, శ్రీకృష్ణ వేషధారణలతో అభిమానులు అలరించారు. అంగవైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా విభిన్న ప్రతిభావంతులు మహానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. భోజనాల రుచులు ఆస్వాధించిన కార్యకర్తలు... బాగున్నాయని మెచ్చుకున్నారు. ఎన్టీఆర్, శ్రీకృష్ణ వేషధారణలతో అభిమానులు అలరించారు. తొలిరోజు 15వేల మందికే ఆహ్వానాలు పంపినా.  అన్ని ప్రాంతాల నుంచి శ్రేణులు తరలిరావటంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.

  ఉభయ గోదావరి రుచులతో ఘుమ ఘుమలు: టీడీపీ మహానాడులో అల్పాహారం మొదలుకొని భోజనాలు వరకు అనేక రకాల వంటకాలతో అదరగొట్టారు. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వద్ద నిర్వహిస్తున్న టీడీపీ  మహానాడుకు తరలివస్తున్న జనానికి అద్భుతమైన వంటకాలతో ఆప్యాయత, అనురాగాలతో అల్పాహారం, భోజనాలు వడ్డించారు. పూర్తి శాకాహారంతో ఘుమఘుమలాడే రుచులతో వీటిని తయారుచేశారు. 

పూర్తి శాకాహారంతో ఘుమఘుమలాడే రుచులు: గోధుమహల్వా, గోదావరి వేపుళ్లు, దోసావకాయతో 14 రకాల వంటకాలను మహానాడుకి వచ్చే కార్యకర్తలకు అభిమానులకు చక్కటి రుచులు అందించారు. ఆపిల్ హల్వా జిలేబి, తాపేశ్వరం ఖాజా, వెజ్ కట్ లెట్, వెజ్ బిర్యానీ, క్యారెట్ బిన్స్ కర్రీ, ఉల్లి చెట్నీ, పప్పు మామిడి కాయ, దొండకాయ వేపుడు, గుత్తివంకాయ, గొంగుర కూర, రోటీ చెట్నీ, దోస ఆవకాయ, వైట్ రైస్,సాంబార్, పెరుగు, ఉల్లి పెరుగు పులుసు.. మెుదలైన వెజ్ వంటలు చేశారు. మహానాడులో భోజనాలను ఆస్వాధించిన కార్యకర్తలు అద్భుతం అంటున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.