సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా: వైవీ సుబ్బారెడ్డి

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 15, 2024, 9:45 PM IST

thumbnail

YSRCP Leader YV Subba Reddy: సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పార్టీకి పని చేస్తామని తితిదే మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు పని చేస్తారని ఆయన వివరించారు. తమ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామన్నారు. అభ్యర్థుల గెలుపు అవకాశాలు, పార్టీకి జరిగే మేలును బట్టే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని టికెట్‌ కేటాయిస్తారని సుబ్బారెడ్డి వివరించారు.

తాను 2014 నుంచి ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీతో ఉన్నానని వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పని చేసినట్లు పేర్కొన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీపై జగన్ తనతో చర్చించారని, తనకు ఆసక్తి లేదని జగన్​తో చెప్పానని వైవి సుబ్బారెడ్డి  తెలిపారు. అయితే, జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. గతంలో వెలిగొండ ప్రాజెక్ట్  కోసం పని చేశానని, త్వరలో వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని తెలిపారు.  మాగుంటకు టికెట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది సీఎం జగన్ ఇష్టమని తెలిపారు. సీఎం నిర్ణయం మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.