Young Man Died With Dengue In Uravakonda : విజృంభిస్తున్న విషజ్వరాలు.. 'డెంగీ' కాటుకు మరో యువకుడు బలి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 5:18 PM IST

thumbnail

Young Man Died With Dengue In Uravakonda : వాతావరణంలో మార్పులు.. అపరిశుభ్ర పరిసరాలు.. దోమల కారణంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్, డెంగీ జ్వర పీడితుల సంఖ్య ఇటీవల ఎక్కువైంది. వయస్సుతో సంబంధం లేకుండా.. డెంగీ బారిన పడి మృతి చెందుతున్నారు. ముప్పై ఏళ్లైనా నిండకముందే ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగి చిరంజీవిని(28) బలి తీసుకుంది డెంగీ. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ డ్రైవర్స్ కాలనీలో చోటుచేసుకుంది. రెండు మూడు రోజులుగా చిరంజీవి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. 

Three People Died Due To Dengue In Anantapur District : పరీక్షలు చేసిన వైద్యులు చిరంజీవికి డెంగీ జ్వరం ఉందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు చిరంజీవిని వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి కన్నీరుమున్నీరైంది. చిరంజీవి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే ఉరవకొండ నియోజకవర్గంలో డెంగీ జ్వరాల బారిన పడి ముగ్గురు మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.