వన్యప్రాణుల ఉచ్చుకు యువకుడి బలి- మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నం, బయటపడిందిలా!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 3:42 PM IST

thumbnail

Young Man Died By Touching Electric Wires: వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి ఓ యువకుడు బలయ్యాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితులు తాటి బొందలకు మృతదేహాన్ని కట్టి చెరువులో పడేసి పారిపోయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఈ ఘటన కాకినాడ జిల్లా కాండ్రేగులలో చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కార్తీక్ తన స్నేహితులు అచ్చిరాజు, ఈశ్వర్​తో కలసి శుక్రవాం అర్థరాత్రి కాండ్రేగుల శివారు వద్దకు వెళ్లారు. కాండ్రేగులకు చెందిన సతీష్, విష్ణు, సుబ్బారావు వణ్యప్రాణుల కోసం విద్యుత్తు తీగలు అమర్చారు. వీటిని గమనించని కార్తీక్ ముందుకు వెళ్తుండగా తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడని స్నేహితులు తెలిపారు. కార్తిక్ చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు తెలిపేందుకు స్నేహితులు వెళ్లారు. బాధితుని కుటుంబంతో ఘటనా స్థలం వద్దకు వెళ్లి చూడగా అక్కడ మృతదేహం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్తు తీగలు అమర్చిన నిందితులు సమీప చెరువు వైపునకు మృతదేహాన్ని లాక్కొని వెళుతుండగా చూశామని, తమకు హాని తలపెడతారనే భయంతో వారి దగ్గరకు వెళ్లలేదని స్నేహితులు తెలిపారు. విద్యుత్తు ఉచ్చు అమర్చినవారే కార్తీక్ మృతదేహాన్ని చెరువులో పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.