YCP Leaders Arranged Flexi Against Lokesh Padayatra: " లోకేశ్​ పాదయాత్రలో ఆశాంతిని నెలకొల్పాలని.. బ్లేడ్​ బ్యాచ్​, సీసాల బ్యాచ్​ని దింపారు.."

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 4:23 PM IST

thumbnail

 YCP Leaders Arranged Flexi Against Lokesh Padayatra: పాదయాత్ర నిర్వహిస్తున్న లోకేశ్​కు కల్పించని భద్రత.. నూజివీడులో వైసీపీ నాయుకులు ఏర్పాటు చేసిన ఫెక్సీని కాపాడేందుకు పెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్​ పాదయాత్ర కొనసాగిస్తున్న తరుణంలో.. వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. లోకేశ్​ పాదయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో రెచ్చగొట్టే విధంగా.. ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారన్నారు. గోదావరి జిల్లాలోని చింతలపూడి వద్ద రేపు యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. లోకేశ్​ పాదయాత్ర సమయంలో వైసీపీ నాయకులు ఈ చర్యకు దిగటాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నూజివీడులో నిర్వహిస్తున్న పాదయాత్రలో అశాంతిని నెలకొల్పటానికి.. ఏలూరు నుంచి బ్లేడ్​ బ్యాచ్​, సీసాల బ్యాచ్​ని రప్పించారని అన్నారు. పట్టణంలో వైసీపీ నాయకుల కుట్రలను ముందుగానే గ్రహించి.. తిప్పికొట్టినట్లు వివరించారు. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్న సరే తమ ఫిర్యాదులు తీసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.