ఈ నెల 23 నుంచి టీ20 సిరీస్ - సింహాద్రి అప్పన్న సేవలో వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు
VVS Laxman Couple Visited Simhadri Appanna Swamy Temple: భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు విశాఖ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సోమవారం రోజున వీరు స్వామివారిని దర్శించుకోగా.. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను అందించారు. ఆలయాధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత బేడా ప్రదక్షణ చేశారు. లక్ష్మణ్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వీరికి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ మూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల (T20 Series) టీ20 సిరీస్‌కు.. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా భారత మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారని సమాచారం. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో ప్రారంభంకానుంది. ఇప్పటికే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్గా.. భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.