'పరుగుతీసిన సాగరతీరం' - 'వైజాగ్‌ నేవీ మారథాన్‌' ఫుల్ జోష్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 12:43 PM IST

thumbnail

Vizag Navy Marathon 2023 : విశాఖ సాగరతీరంలో వైజాగ్‌ నేవీ మారథాన్‌ - 2023 ఉత్సాహంగా సాగింది. 42.2 కిలోమీటర్ల ఫుల్‌ మారథాన్, 21.1 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్‌, 10K, 5K కేటగిరీల్లో మారథాన్‌ నిర్వహించారు. ఫుల్‌ మారథాన్‌ను తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంథార్కర్‌ ప్రారంభించగా.. హాఫ్‌ మారథాన్‌ వైస్‌ అడ్మిరల్‌ శ్రీనివాసన్‌, 10K ను విశాఖ సీపీ జెండా ఊపి ప్రారంభించారు. వైజాగ్‌ నేవీ మారథాన్‌ ఇప్పటివరకు ఏడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 8వ ఎడిషన్‌ను నిర్వహించారు. 

Navy Marathon at RK Beach Visakhapatnam : శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో వైజాగ్‌ నేవీ మారథాన్‌ను ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మారథాన్‌లో భారీ సంఖ్యలో నేవీ ఉద్యోగులు, నగరవాసులు తరలివచ్చారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందించారు. మారథాన్​లో పిల్లలు, పెద్దవాళ్లు తేడా లేకుండా అధిక సంఖ్యలో జనం పాల్గొనడం సంతోషకరమని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.