Visakha Beach Turns into Pollution: డంపింగ్​యార్డ్​ని తలపిస్తోన్న విశాఖ బీచ్.. ప్రకృతి ప్రేమికుల ఆందోళన

By

Published : Jul 19, 2023, 2:13 PM IST

thumbnail

Visakha Beach Turns into Pollution: విశాఖ సాగర తీరం వ్యర్థాలతో నిండిపోతోంది. వర్షాలకు రోడ్లపై ఉన్న చెత్తంతా బీచ్‌ వద్దకే చేరుతోంది. కొన్నిచోట్ల సాగర తీరం.. డంపింగ్ యార్డ్‌లా కనిపిస్తోంది. ఫలితంగా.. సాగర తీరంలో ఇసుక కానరాక.. బీచ్ సహజ అందాల్ని కోల్పోతోంది. మరో వైపు నిర్మాణ వ్యర్థాలను కూడా సాగర తీరంలో పడేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్నది పర్యావరణ హితకారుల ఆరోపణ. దీనికి ఊతమిచ్చే విధంగా బీచ్​లో వ్యర్థాలు తరుచూ గుట్టలుగా దర్శన మివ్వడం, తర్వాత వాటిని చదును చేసేయడం వల్ల ఇసుక తీరం మాయమైపోతోంది. దీంతో సాగర తీరం తన సహజ లక్షణాన్ని కోల్పోతుందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పెద్ద ఎత్తున మురుగునీరు కూడా సముద్రంలోకి చేరుతోంది. ఈ పరిస్థితి నివారణకు కొన్నేళ్లుగా జరుగుతున్న కసరత్తు ఏమాత్రం ఫలితం చూపడం లేదనేది తేటతెల్లం అవుతోంది. అధికారులు దీనిపై స్పందించి విశాఖ బీచ్​లకు ప్రమాదకరంగా తయారైన మురుగునీరు, చెత్త పోగుల సమస్యపై క్షేత్రస్థాయి కథనం మీకోసం..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.