Villagers Questioned YCP MLA Kiran Kumar: నాలుగేళ్లలో ఏం చేశారు.. ఎమ్మెల్యే కిరణ్​ కుమార్​ను అడ్డుకున్న గ్రామస్థులు

By

Published : Aug 4, 2023, 8:05 PM IST

thumbnail

Villagers Questioned Echerla YCP Mla: ఎచ్చర్ల నియోజకవర్గ వైయస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్​కు తీవ్ర నిరసన సెగ తగిలింది. వైయస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అయినా తమ గ్రామంలో ఏ సమస్యలు పరిష్కరించలేదని గొర్లె కిరణ్ కుమార్​ను గ్రామస్థులు నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కిరణ్​ ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామంలో పర్యటించారు. తమ గ్రామంలోకి ఎమ్మెల్యే వచ్చాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు.. వైయస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా తమ గ్రామంలో రహదారులు, కాలువలు తదితర సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తోటపాలెం గ్రామంలో ఏడాదిగా ఎలాంటి ఉపాధి పనులను వైయస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం కల్పించలేదని గ్రామస్థులు వాపోయారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే కిరణ్ కుమార్.. గ్రామ సమస్యల గురించి  సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశానని పేర్కొన్నారు. గ్రామస్థులు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీస్తున్న సమయంలో పలువురు యువకులు వీడియోలు తీయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.