వంజంగి కొండపై పర్యాటకుల సందడి - కనీస సౌకర్యాలు లేవని ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 1:21 PM IST

thumbnail

Vanjangi Tourists Facing Troubles in Alluri Distrct: అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి పర్యాటకుల తాకిడితో కిటకిటలాడింది. వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ప్రైవేటు వాహనాల్లో వచ్చారు. అయితే ఘాట్ రోడ్ మధ్యలో ప్రవేశ రుసుము టోల్గేట్ ఉన్నచోట రహదారి సౌకర్యం సరిగా లేకపోవటంతో మార్గమధ్యలోనే కొన్ని వాహనాలు మొరాయించి నిలిచిపోయాయి. దీంతో కొండ వద్దకు చేరుకునేందుకు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 

Lack of Facilities at Vanjangi Hill: సూర్యోదయాన్ని తిలకించే పర్యటకులు కిలోమీటర్ల మేర నడవలేక మధ్యలోనే ఉండిపోయారు. ఐటీడీఏ తరఫున కార్లు, బైకులతోపాటు నడిచి వెళ్లేవారికి కూడా ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారు. కానీ, కనీసం మహిళలకు మరుగుదొడ్లు కూడా ఏర్పాట్లు చేయలేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేశారు. మేఘాల కొండ ఎక్కలేక పర్యాటకులు మధ్యలోనే నిలిచిపోయారు. పర్యాటకుల దృష్ట్యా వంజంగి కొండ వద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.