Retirement Age Increase Notices: వర్సిటీల అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు పెంపు..

By

Published : Jul 30, 2023, 12:05 PM IST

thumbnail

University Faculty Retirement Age Increase Notices: ఏపీలోని యూనివర్సిటీల అధ్యాపకులకు సర్కారు తియ్యటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని వర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు విడుదల చేశారు. ఏపీ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర యూనివర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్​లకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు వర్సిటీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు మాత్రమే ఉండగా.. దాన్ని 62కు పెంచారు. కాగా ప్రస్తుతం అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును సీఎం జగన్మోహన్​ రెడ్డి మరో మూడేళ్లుకు పొడిగించారు. దీనిపై వర్సిటీ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. నిరుద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.