ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న ఈత సరదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 5:56 PM IST

thumbnail

Two Students Lost Their Lives After Going Swimming : పాఠశాలకు వెళ్తున్నమని చెప్పి ఈతకు వెళ్లికి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు విద్యార్థులు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బుధవారపేటలో జరిగింది. స్థానిక ఇందిరాగాంధీ మెమోరియల్ హైస్కూల్​లో చదువుతున్న... సాయి చరణ్ (13), ప్రవీణ్ కుమార్ (15) శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లకుండా ఈత కొట్టేందుకు కేసీ కాలువకు వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. పిల్లలు ఇద్దరు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో ప్రవీణ్ కుమార్ మృతదేహం లభ్యమయ్యింది. ఇంకా సాయి చరణ్ ఆచూకీ తెలియాల్సి ఉందని పోలీస్ అధికారులు తెలిపారు. ఈత రాని పవన్​కుమార్​ను కాపాడే ప్రయత్నంలో సాయిచరణ్ మునిగిపోయడని స్థానికులు తెలిపారు. రోజు పాఠశాలకు వెళ్లి వచ్చే తమ పిల్లలు ఇంకా రారు అనే విషయం తెలిసి తల్లిదండ్రులు పుట్టెడు శోకంలో మునిగిపోయారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను చూసి స్థానికుల మనస్సు కలచివేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.