ఇద్దరు విద్యార్థులను బలిగొన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు - పనులకు వెళ్లిన తల్లిదండ్రులు వచ్చేలోపే!
Two Students Died After Falling Into Summer Storage Tank : కర్నూలు జిల్లా ఆదోని మండలంలో విషాదం చోటుచేసుకుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మండలంలోని పెద్ద హరివాణానికి చెందిన విద్యార్థులు మంజు, షమీ నీళ్లు తాగేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్దకు వెళ్లారు. నీరు తాగుతుండగా ప్రమాదవశాత్తు స్టోరేజ్ ట్యాంకులో పడిపోయారు. ఈ విషయం గమనించిన స్థానికులు.. హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటిల్కు తరలించారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు.
వ్యవసాయ పనుల కోసం వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు.. విషయం తెలుసుకొని ఆసుపత్రికి చేరుకున్నారు. రోజు పాఠశాలకు వెళ్లి వచ్చే తమ పిల్లలు ఇంకా రారని తెలిసి.. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని చూసి స్థానికుల మనస్సు కలచివేసింది. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంధువులు ద్వారా విషయాన్ని సేకరించి కేసు నమోదు చేశారు.