Two Governor Quota MLC Notification Issued: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా పద్మశ్రీ, రవిబాబు

By

Published : Aug 11, 2023, 10:23 AM IST

thumbnail

Two Governor Quota MLC Notification Issued: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు శాసన మండలి సభ్యుల స్థానాలు భర్తీ చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నామినేట్ చేసిన కర్రి పద్మ శ్రీ , కుంభా రవి బాబులను ఆ కోటా కింద భర్తీ చేస్తూ జీవో విడుదల చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న శివనాధ్ రెడ్డి, ఎన్.ఎండీ ఫరూక్​ల పదవీ కాలం జూలై 20 తేదీతో ముగియటంతో ఆ ఖాళీల్లో వీరిని భర్తీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా జీవో నెంబర్​ 87ను జారీ చేశారు. గవర్నర్ నామినేట్ చేసిన శాసన మండలి సభ్యుల పదవీ కాలం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి ఆరు సంవత్సరాల పాటు ఉంటుందని ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.