Tractor Accident in CC Footage పెట్రోల్ బంక్​లో అదుపు తప్పి.. డ్రైవర్​పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్! సీసీ కెమెరాలో దృశ్యాలు..!

By

Published : Aug 2, 2023, 11:43 AM IST

thumbnail

Tractor Accident at Petrol Bunk ట్రాక్టర్​కు డీజిల్ నింపేందుకు పెట్రోల్​ బంక్​ వద్దకు వెళ్లగా.. వాహనం అదుపుతప్పటంతో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో బుధవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. వ్యవసాయ పనుల నిమిత్తం ఎన్టీఆర్ జిల్లా పెద్దాపురంకు చెందిన వ్యక్తి.. ఎర్రుపాలెం పెట్రోల్‌ బంకులో ట్రాక్టర్‌కు డీజిల్‌ కొట్టించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వాహనాన్ని పెట్రోల్​ బంక్​ వద్ద ఆపాడు. అయితే ఆ సమయంలో న్యూట్రల్​లో ఉంచి ట్రాక్టర్ నుంచి దిగే క్రమంలో గేర్‌ పడటంతో అతడి పై నుంచి ట్రాక్టర్ వెళ్లింది. ఇది గమనించిన పెట్రోల్‌ బంకు సిబ్బంది.. వెంటనే వాహనానికి బ్రేక్‌ వేసి ట్రాక్టర్‌ను అదుపుచేశారు. దీంతో ఈ ఘటనలో మరో ప్రమాదం జరగకుండా నిలువరించారు. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.