Tomato record Price : మదనపల్లె మార్కెట్​లో చరిత్ర లిఖించిన టమాటా ధర.. రికార్డు స్థాయిలో కిలో రూ.168..

By

Published : Jul 26, 2023, 4:14 PM IST

thumbnail

Tomato Prices in Madanapalle Market: టమాటా ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయి ధరలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా దిగుబడి తగ్గింది. దీంతో మదనపల్లె మార్కెట్​లో రికార్డు స్థాయిలో నాణ్యమైన టమాటా కిలో 168 రూపాయలు పలికింది. దీంతో 30 కిలోల టమాటా బాక్సు విక్రయిస్తే ఒక గ్రాము బంగారు కొనుగోలు చేయవచ్చని రైతులు పేర్కొంటున్నారు. అదే విధంగా రెండో రకం కిలో టమాటా ధర.. కిలో ఆపిల్​ ధరకు సమానమైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డ్​లో బుధవారం టమాటా ధరలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు.. పంటకు వైరస్ సోకి దిగుబడి తగ్గిపోవడం ధరలు పెరుగుదలకు కారణమని మార్కెట్ యార్డ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం మదనపల్లె మార్కెట్ యార్డ్​కు 361 టన్నులు మాత్రమే టమాటా దిగుబడులు వచ్చాయి. గత వారం రోజులుగా దిగుబడిని పరిశీలిస్తే అనూహ్యంగా తగ్గుతూ వచ్చాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.