సొంత తమ్ముడని బిడ్డనిచ్చి వివాహం చేస్తే! - ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊపిరి తీశాడు
The Younger Brother Who Killed His Older Sister : సొంత తమ్ముడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుంటుందని భావించింది దొగ్గ లక్ష్మి. వివాహమై కొన్ని రోజులు కూడా కాలేదు.. కుటుంబ కలహాలతో తన కుమారై ఇంటి తిరిగి వచ్చేసింది. ఎంత కాలం గడిచిన తన భార్య ఇంటికి రాకపోవడంతో.. తరచూ అక్కతో ఘర్షణకు దిగేవాడు. ఈ ఘర్షణ ఆమె ప్రాణాలను బలితీసుకుంది.
విశాఖ జిల్లా పెందుర్తిలోని చిన్న ముసలివాడ గణేశ్ నగర్ కాలనిలో దొగ్గ లక్ష్మి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమారైలు. ఆమె రెండో కుమారైన ప్రత్యూషను తన సొంత తమ్ముడైన కె.సన్యాసినాయుడికి ఇచ్చి వివాహం జరిపించింది. కుమారై వివాహ జీవితం సరిగా లేకపోవడంతో.. గత కొంత కాలం నుంచి తన భార్య అక్క వారి ఇంట్లోలోనే ఉంటుంది. ఈ కారణంతో సన్యాసినాయుడు తరచూ అక్కతో ఘర్షణకు దిగేవాడు.
నిన్న మధ్యాహ్నం (నవంబరు 20) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన అక్కతో ఘర్షణకు దిగాడు సన్యాసినాయుడు. ఈ ఘర్షణలో ఆమె కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు సన్నాసినాయుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.