Telugu People Protest in United States on CBN Arrest: 'జై చంద్రబాబు.. మేము సైతం బాబు కోసం..' ఫ్లోరిడాలో తెలుగు ప్రజల సంఘీభావం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 3:18 PM IST

thumbnail

Telugu People Protest in United States: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలు.. ఖండాతరాల్లో చంద్రబాబుకు మద్దతుగా ఎవరి తీరులో వారు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ర్యాలీలు, ధర్నాలు, ప్రత్యేక పూజలు ఇలా ఎవరి సంఘీభావాన్ని వారు తెలియజేస్తూనే ఉన్నారు. తమ అధినేతను విడుదల చేయాలంటూ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. 

ఆమెరికాలోని ప్రవాస భారతీయులు, తెలుగుదేశం విభాగానికి చెందిన నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పాం బీచ్​లో ఉన్న ఒకీహీలీ పార్కులో ఈ కార్యక్రమం నిర్వహించగా.. తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. వాసు కర్లపూడి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో చంద్రబాబుకు మద్దతుగా తెలుగు ప్రజలు, టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సేవ్​ ఆంధ్ర అంటూ తమ నిరసన గళాన్ని వినిపించారు. అమెరికాకు తెలుగువాళ్లు వచ్చారంటే దానికి కారణం చంద్రబాబేనని నిరసనలో పాల్గొన్న తెలుగు ప్రజలు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.