TDP PowerPoint Presentation on Inner Ring Road ఇన్నర్ రింగ్‌రోడ్డ్‌ ప్రాజెక్టు-వాస్తవాలపై టీడీపీ.. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్.. వేయని రోడ్డుతో లబ్ది ఎలా?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 4:10 PM IST

thumbnail

TDP PowerPoint Presentation on Inner Ring Road Project: 'ఇన్నర్ రింగ్‌రోడ్డ్‌ ప్రాజెక్టు - వాస్తవాలు' అనే అంశంపై ఎమ్మెల్సీ(MLC) పంచుమర్తి అనురాధ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్(PowerPoint Presentation ) కార్యక్రమం నిర్వహించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపై రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. అనురాధ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ముందే భూమి కొనుగోలు చేసిన హెరిటేజ్ సంస్థకి ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా లబ్ది ఎలా సాధ్యమని ఎమ్మెల్సీ  ప్రశ్నించారు. 1980 నుంచి భూములు ఉన్న లింగమనేని సంస్థకు ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల 14ఎకరాలు కోల్పోతుందని కోర్టుకు ఆఫడివిట్ ఇచ్చిందని తెలిపారు. ఇన్నర్ రింగ్ (Inner Ring Road ) రోడ్డు కోసం ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదని పంచుమర్తి పేర్కొన్నారు. అసలు ఏ రకమైన బడ్జెట్‌ను కేటాయించలేదని.. వేయని రోడ్డుకు రూ.2,400 కోట్లు లబ్ధి పొందారని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్లు విలువ ఉన్న హెరిటేజ్‌కు రూ.8 కోట్లు లాభం అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్‌పై వైసీపీ (YCP) చేసేది కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే అని ఆమె ఆరోపించారు.  

లేని ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల లబ్ది చేకూరితే... అప్పటి సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ పై ఎందుకు కేసు పెట్టలేదని అనురాధ నిలదీశారు. క్విడ్ ప్రోకో, ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి పదాలను తన కేసుల ద్వారా పరిచయం చేసిన ఘనత సీఎం జగన్​(CM Jagan)కు దక్కుతుందని విమర్శించారు.  ఆ బురదను తెలుగుదేశానికి అంటకట్టడం తప్ప మరొకటి కాదని స్పష్టంచేశారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఫిర్యాదు ఇస్తే, సీఐడీ వెంటనే కేసు నమోదు చేసిందన్నారు. కొడుకు బాగుండాలి - కోడలు భర్తని కోల్పోవాలి అన్నట్లు సీఐడీ తీరు ఉందంటూ విమర్శించారు. హెరిటేజ్(Heritage) సంస్థ అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో భూమి కొంటే ఇన్నర్ రింగురోడ్డుకు దానిని లింక్ పెట్టడం అర్ధరహితమని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.