TDP MLC Ashok Babu Fires on CM Jagan : ఫీజు రీయింబర్స్​మెంట్​పై జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి : అశోక్​బాబు

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Aug 28, 2023, 8:26 PM IST

thumbnail

TDP MLC Ashok Babu fires on CM Jagan: నాలుగేళ్లలో విద్యారంగం పరిపుష్టికి జగన్ రెడ్డి తీసుకున్న చర్యలు శూన్యమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. తప్పుడు నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో జగన్ రెడ్డి విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మఒడి చెల్లింపులతో విద్యారంగం బాగుపడితే, విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గాయో ముఖ్యమంత్రి (Chief Minister) చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ పథకాల చెల్లింపుల్లో ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఫలితాలు అధ్వానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

TDP Government..  టీడీపీ ప్రభుత్వం 19 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్ (Fee Reimbursement) ఇస్తే, జగన్ రెడ్డి 9.8 లక్షల మందికే చెల్లిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో మొత్తం బడ్జెట్​లో 1.43శాతం నిధులు ఫీజు రీయింబర్స్​మెంట్​కు చెల్లిస్తే, జగన్ 0.93శాతమే చెల్లించాడని విమర్శించారు. 2020-21 విద్యా సంవత్సరంలో ఒక విడత ఫీజు రీయింబర్స్​మెంట్ ఎగ్గొట్టాడని.. 2023-24లో ఆఖరి విడత చెల్లింపులు చేయలేదని ఆరోపించారు. జగన్ రెడ్డి దుష్ప్రచారం మానుకొని ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లింపులపై వాస్తవ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని అశోక్​బాబు డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.