TDP Leaders to Meet Governor: రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్ ఆరా..! టీడీపీ నేతలకు అపాయింట్​మెంట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 12:33 PM IST

thumbnail

TDP Leaders to Meet Governor: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశంతో పాటు.. రాష్ట్రంలో పరిణామాలను వివరించేందుకు తెలుగుదేశం నేతల బృందం గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ను కలవనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు టీడీపీ నేతలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. న్యాయస్థానాల్లో 17ఏ పై కీలక వాదనలు జరిగిన క్రమంలో గవర్నర్‌తో తెలుగుదేశం నేతల భేటీ.. చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కేసులపై గవర్నర్ ఇప్పటికే ఆరా తీసినట్లు సమాచారం. 17 A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని తెలుగుదేశం నేతలు.. గవర్నర్‌కు వివరించనున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్బంధాలపైనా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ను కలవనున్న వారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్యెల్సీ యనమల రామకృష్ణుడు, మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు.

ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలిపినా.. ప్రతిపక్ష నేతలకు మద్దతుగా ఏవైనా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్​తో చర్చించాల్సిన అంశాలపై పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో టీడీపీ నేతలు సమావేశం కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.