మూడు నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి చంద్రబాబు - టీడీపీలోకి చేరనున్న వైఎస్సార్​సీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 10:04 AM IST

Updated : Dec 14, 2023, 12:46 PM IST

thumbnail

TDP Leaders And Workers Will Meet Chandrababu In TDP Party Office: తెలుగుదేశం అధినేత చంద్రబాబు మూడు నెలల విరామం తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి రావడంతో ఆయనను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు సమక్షంలో ఇవాళ, రేపు వైఎస్సార్​సీపీ శ్రేణులు తెలుగుదేశంలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కదిరి, ఏలూరు, రామచంద్రపురం, తంబళ్లపల్లి, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల నుంచి పార్టీలోకి పెద్ద సంఖ్యలో వైఎస్సార్​సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించాయి.  

నైపుణ్యాభివృద్ధి కేసులో బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు తొలిసారి పార్టీ కార్యాలయానికి రాగా ఆయనను కలిసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చంద్రబాబుకు పూలమాలతో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ నెల 21న ఉదయం చంద్రబాబు విజయవాడలోని గుణదల మేరీమాత ప్రార్థనా మందిరాన్ని సందర్శించి, సాయంత్రం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Last Updated : Dec 14, 2023, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.