TDP Leader Peethala Sujatha on Suraksha జే బ్రాండ్​తో అనారోగ్యం ఇచ్చి.. సురక్షతో ఆరోగ్యమా! ప్రజల జీవితాలతో జగన్ ఆటలు ఆడుతున్నాడు..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 9:48 PM IST

thumbnail

TDP Leader Peethala Sujatha Comments: జగన్ రెడ్డి తీసుకొచ్చింది జగనన్న సురక్ష కాదు.. ప్రజల్నిశిక్షించే కార్యక్రమమని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అన్నివిధాలా వైద్యరంగాన్ని భ్రష్టుపట్టించి, ఇప్పుడు సురక్షా అఁటూ.. కొత్త డ్రామాలు చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఒక పక్క నాసిరకం మద్యం అమ్ముతూ.. ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టిన జగన్, సురక్ష అంటూ ప్రచారా ఆర్భాటానికి తెరతీయడం ఆయనకే చెల్లిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు రోగాలపాలు కావడానికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవడానికి ప్రధాన కారణం జగన్ రెడ్డి అమ్మతున్న జేబ్రాండ్ మద్యమేనని ఆరోపించారు.  సురక్ష కార్యక్రమంలో విధులు నిర్వహించే ఆశా సిబ్బంది   వైద్యఆరోగ్య సిబ్బందినే రక్షించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారని పీతల ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతితో కుళ్లిపోతూ.. రాజకీయ కక్షతో రగిలిపోతున్న వైసీపీ వారికి, ముఖ్యమంత్రికే ఈ సురక్ష పథకం చాలా అవసరమని ఆమె ఎద్దెవా చేశారు. సీఎం జనగ్ అధికారంలోకి రావడానికి.. రాష్ట్రంలో దశలవారిగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని చెప్పారన్నారు. కానీ, నేడు ప్రతి ఊరూ, వాడలో మద్యం విచ్చలవిడిగా లభిస్తుందని ఆరోపించారు. మద్యంపై బాండ్ల ద్వారా అప్పులు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాప్​ల లీజ్​ను మరో సంవత్సరం పొడిగించారని వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.