"వైసీపీ బస్సుయాత్ర బుస్సుయాత్రగా మారింది"
Published: Nov 15, 2023, 1:40 PM

TDP Leader Budha Venkanna on YSRCP Bus Yatra: వైసీపీ నాయకులు చేపట్టిన సామాజిక బస్సుయాత్ర బుస్సుయాత్రగా మారిందని.. టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. బస్సుయాత్రపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనబడిందని.. అందువల్లే మూడుసార్లు యాత్రకు బ్రేక్ వేశారన్నారు. 33మంది బీసీలను ఊచకోత కోయించి.. కేసులు లేకుండా చేసినప్పుడు జగన్కు బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీసీలను దగా చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని బుద్దా మండిపడ్డారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కలిసిన తర్వాత.. సీఎం జగన్కు.. పులివెందులలోనూ ఓటమి భయం పట్టుకుందని అభిప్రాయపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి పిరికి పంద కాబట్టే 10నెలల క్రితం ఘటనలో ఇప్పుడు బీటెక్ రవిని అరెస్టు చేయించాడని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి జాతకం బాలేదు కాబట్టే చంద్రబాబు జోలికి వచ్చాడన్నారు. చంద్రబాబు రాశిఫలం బాలేదని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను బుద్దా ఖండించారు.